ETV Bharat / sports

భారత్ Vs ఆస్ట్రేలియా - ఈ వివాదాలను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరుగా! - IND VS AUS TOP CONTROVERSIES

భారత్, ఆసీస్ మధ్య జరిగిన 10 కీలక వివాదాలు ఇవే!

india vs australia
india vs australia (AFP)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 12, 2024, 12:57 PM IST

Top 10 Controversies of Ind vs Aus Test : బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నవంబరు 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఆస్ట్రేలియా గడ్డపై భారత్ ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్‌ ఆడటం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో ఇందులో ఎలాగైనా గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ పైనల్​కు చేరుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. స్వదేశంలో కివీస్​తో సిరీస్ ఓడిన టీమ్​ఇండియా, ఆసీస్​పై రాణించాలని యోచిస్తోంది. మరోవైపు, 10 ఏళ్ల తర్వాత భారత్​పై టెస్టు సిరీస్ గెలవాలని ఆస్ట్రేలియా కసిగా ఉంది.

గత రెండు దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, టీమ్​ఇండియా మధ్య టెస్టు క్రికెట్​లో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని యాషెస్ సిరీస్​లా మారిపోయింది. 1996లో ప్రారంభమైన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమ్​ఇండియానే పైచేయి సాధించింది. ఇప్పటివరకు 10 సార్లు భారత్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో భారత్- ఆసీస్ జట్లు మధ్య జరిగిన ఈ 10 వివాదాలు గురించి తెలుసుకుందాం.

1. మంకీ గేట్
క్రికెట్ చరిత్రలో మంకీగేట్ ఒక చీకటి అధ్యాయం. 2008లో సిడ్నీలో జరిగిన టెస్టులో ఆసీస్ ప్లేయర్ ఆండ్రూ సైమండ్స్-హర్భజన్ సింగ్ మధ్య వివాదం జరిగింది. తనపై భజ్జీ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని సైమండ్స్ ఆరోపించాడు. మంకీగా సంబోధిస్తూ తిట్టాడని అన్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రిఫరీ భజ్జీపై మూడు టెస్టుల నిషేధంతోపాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించాడు. దీనిపై భారత జట్టు యాజమాన్యం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో హర్భజన్​కు 50శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించారు.

2. పేలవమైన అంపైరింగ్
2008 బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అంపైర్లు పక్షపాతం వహించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ సిరీస్​ను ఆస్ట్రేలియా 2-1తో గెలిచింది. ఈ సిరీస్​లో ఒక జట్టు మాత్రమే స్పోర్టివ్ స్పిరిట్​తో ఆడిందని అప్పటి టీమ్ ఇండియా కెప్టెన్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది.

3. గావస్కర్ ఫైర్
1981లో మెల్​బోర్న్​లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. టీమ్​ఇండియా బ్యాటర్ సునీల్ గావస్కర్, చేతన్ చౌహాన్ క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్ డెన్నిస్ లిల్లీ విసిరిన బంతి గావస్కర్ కాలికి తగిలింది. దీంతో అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్​గా ఇచ్చాడు. అది ఔట్ కాదని సునీల్ గావస్కర్ బలంగా నమ్మాడు. మైదానంలో నుంచి వెళ్లడానికి ఇష్టపడలేదు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న సునీల్ గావస్కర్​పై డెన్నీస్ లిల్లీ కామెంట్​ చేశాడు. దీంతో మైదానం నుంచి తనతో పాటు వచ్చేయాలని చేతన్ చౌహాన్​ను గావస్కర్ కోరాడు. చేతన్, గావస్కర్ మైదానాన్ని వదిలివెళ్లగా మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. మళ్లీ కాసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగి మ్యాచ్ ప్రారంభమైంది.

4. గంగూలీ టాస్ ఆలస్యం
2001 టెస్టు సిరీస్​లో సౌరభ్ గంగూలీ తనను టాస్ కోసం చాలాసేపు వేచి ఉండేలా చేశాడని స్టీవ్ వా ఆరోపించాడు. ఈ విషయం తనను చాలా గాయపర్చిందని పేర్కొన్నాడు. అయితే తన బ్లేజర్ కనిపించకపోవడం వల్లే టాస్​కు ఆలస్యంగా వెళ్లానని గంగూలీ కొన్నాళ్ల తర్వాత చెప్పుకొచ్చాడు.

5. సచిన్ నాటౌట్
1999లో ఆసీస్ పేసర్ మెక్​గ్రాత్ వేసిన బంతి సచిన్ భుజానికి తగిలింది. కానీ అంపైర్ ఔట్​గా డిక్లేర్ చేశాడు. దీంతో సచిన్ డకౌట్ అయ్యాడు. ఈ విషయం కూడా అప్పట్లో దుమారం రేపింది. అంపైర్ నిర్ణయం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి.

6. ద్రవిడ్ క్యాచ్ వివాదం
2001లో ముంబయిలో భారత్​తో ఆస్ట్రేలియా జట్టు టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్​లో ద్రవిడ్ క్యాచ్​ను స్లిప్​లో ఉన్న స్లేటర్ పట్టాడు. అది భూమిని తాకిందనే అనుమానంతో అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ద్రవిడ్​ను నాటౌట్​గా పరిగణించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్లేటర్, అంపైర్​పై అరిచాడు. అలాగే ద్రవిడ్ వద్దకెళ్లి స్లెడ్జింగ్ చేశాడు. అయినప్పటికీ ద్రవిడ్ స్పందించలేదు. అయితే మ్యాచ్ అనంతరం తన తప్పు తెలుసుకున్న స్లేటర్ ద్రవిడ్​కు క్షమాపణలు చెప్పాడు. దీంతో వివాదం సద్దుమణిగింది.

7. కోహ్లీ-ఆస్ట్రేలియా అభిమానుల మధ్య గొడవ
సిడ్నీలో 2012లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ అరుదైన ఘటన జరిగింది. కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడిపై ఆస్ట్రేలియా అభిమానులు దూషణలు చేశారు. దీంతో కోహ్లీకి కోపం వచ్చి తన కుడిచేతి మధ్య వేలును ఆస్ట్రేలియా అభిమానులకు చూపించాడు. ఆ ఫొటోలు అప్పట్లో అన్ని వార్తా పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. దీంతో కోహ్లీపై ఒక మ్యాచ్ నిషేధం, ఫీజులో సగం జరిమానా విధించారు.

8. గంభీర్-వాట్సన్ వైరం
2008లో భారత పర్యటనకు ఆస్ట్రేలియా వచ్చినప్పుడు ఈ ఉదంతం జరిగింది. దిల్లీ వేదికగా జరిగిన టెస్టులో గౌతమ్​ గంభీర్-షేన్ వాట్సన్ మధ్య కాస్త గొడవ జరిగింది. వాట్సన్ బౌలింగ్​లో షాట్ ఆడిన గౌతీ, సింగిల్ తీసి నాన్‌ స్ట్రైక్ ఎండ్ వెళ్లాడు. అయితే మరో పరుగుకు చాన్స్ ఉండటం వల్ల ముందుకువచ్చాడు. ఈ క్రమంలో మధ్యలో అడ్డుగా వచ్చిన వాట్సన్​ను తన మోచేతితో తోశాడు. ఇది వివాదంగా మారింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ గౌతీపై ఒక మ్యాచ్‌ నిషేధం విధించింది.

9. పిచ్‌ లో బీర్ పార్టీ
ఈ వివాదం ఆటగాళ్లకు సంబంధం లేదు. 2012లో పెర్త్​లోని వాకా స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ బీర్ పార్టీని చేసుకున్నారు. దీనిపై టీమ్ ఇండియా ఆటగాళ్లు, మేనేజమెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

10. ద్రవిడ్ చెవికి గాయం
2004లో ఆసీస్ పర్యటనకు భారత్ వెళ్లింది. అందులో భాగంగా సిడ్నీలో జరిగిన మ్యాచ్​లో బ్రెట్ లీ వేసిన బౌన్సర్ ద్రవిడ్ చెవికి తగిలింది. దీంతో ద్రవిడ్ చెవి నుంచి రక్తం వచ్చింది. ఈ విషయంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ద్రవిడ్​కు గాయం కాగానే అప్పటి కెప్టెన్ గంగూలీ రెండో ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేశాడు.

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ: జట్టు ప్రకటించిన ఆస్ట్రేలియా- టీమ్​లోకి కొత్త కుర్రాడు

'ఆస్ట్రేలియాకు రోహిత్ వస్తాడు - కానీ, తొలి టెస్టులో ఆడటం డౌటే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.