ETV Bharat / sports

ఈ భారత క్రికెటర్ల కెరీర్​లో​ ఆ చెత్త రికార్డ్​కు నో ప్లేస్​! - NO DUCK OUT BATSMAN

ఈ భారత క్రికెటర్ల ఖాతాలో అస్సలు నమోదు కానీ చెత్త రికార్డ్​ ఇదే!

Ravichandran Ashwin (Left), Irfan Pathan (Right)
Ravichandran Ashwin (Left), Irfan Pathan (Right) (Source ANI and IANS)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 17, 2024, 7:05 AM IST

No Duck Out Batsman : ప్రపంచ క్రికెట్​లో ఇప్పటికే ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. భవిష్యత్​లోనూ మరెన్నో రికార్డులు క్రియేట్​ అవుతాయి. రన్స్​, సెంచరీలు, వికెట్లు, క్యాచ్‌లు ఇలా అన్నింటిలోనూ రికార్డులు ఉంటాయి. వీటితో పాటు చెత్త రికార్డులు కూడా ఉంటాయి. అందులో ఒకటి డకౌట్‌.

పెవిలియన్‌ నుంచి గ్రౌండ్‌లోకి బ్యాట్‌తో అడుగుపెట్టిన ఓ ప్లేయర్​ స్టేడియంలో లక్షలాదిమంది చూస్తుండగా డకౌట్ అయితే ఆ బాధ చెప్పలేనంతగా ఉంటుంది. ఏ పరుగులు చేయకుండా గోడకు కొట్టిన బంతిలా వెనక్కి రావాలని ఏ క్రికెటరూ కోరుకోడు. కానీ స్టార్ క్రికెటర్లు కూడా కెరీర్‌లో ఏదో ఒక సందర్భంలో సున్నా పరుగులకే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే కొందరు ప్లేయర్‌లు కనీసం ఒక్క ఫార్మాట్‌లో అయినా డకౌట్‌ కాకుండా ఉన్నారు. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్న కొంతమంది క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యశ్‌పాల్ శర్మ (వన్డే) - యశ్‌పాల్ శర్మ 1974లో భారత్ తరఫున వన్డేలు ఆడటం ప్రారంభించాడు. అప్పటి నుంచి మొత్తం 256 మంది క్రికెటర్లు వన్డేల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ ఆటగాళ్లందరిలో యశ్‌పాల్ శర్మ ఒక్కడే ఎప్పుడూ డకౌట్ అవ్వలేదు. 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో కూడా యశ్‌పాల్ కీలక ఆటగాడు. 1978 నుంచి 1985 వరకు మిడిల్ ఆర్డర్ బ్యాటర్​గా రాణించాడు. అతడి కెరీర్‌లో యశ్‌పాల్ శర్మ 42 మ్యాచ్‌లు ఆడాడు. 40 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. 28.48 యావరేజ్‌, 63.02 స్ట్రైక్ రేట్‌తో 883 పరుగులు చేశాడు.

బ్రిజేష్ పటేల్ (టెస్ట్) - మరో భారత మాజీ క్రికెటర్ బ్రిజేష్ పటేల్ టెస్టుల్లో ఎప్పుడూ డకౌట్ కాలేదు. 1974 నుంచి 1977 మధ్య పటేల్ భారత్​ తరఫున 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 29.45 యావరేజ్‌తో 972 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 115 నాటౌట్. 38 ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ బ్రిజేష్‌ ఎప్పుడో డకౌట్‌ కాలేదు. బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవగలిగాడు.

రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్ (టీ20) - అత్యంత దూకుడుగా ఆడాల్సి ఉండటంతో టీ20 క్రికెట్‌లో ఎక్కువగా డకౌట్‌ అవుతుంటారు. కానీ భారత ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్ పొట్టి ఫార్మాట్‌లో ఒక్కసారి కూడా సున్నా పరుగులకు పెవిలియన్‌ చేరలేదు.

ప్రధానంగా ఆఫ్ స్పిన్నర్‌ అశ్విన్ మొత్తం 65 టీ20 మ్యాచ్‌ల్లో 19 సార్లు బ్యాటింగ్ చేశాడు. వీటిల్లో 12 ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు. చాలా సందర్భాల్లో లోయర్‌ ఆర్డర్‌లో జట్టు కోసం విలువైన పరుగులు చేశాడు.

భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా టీ20 క్రికెట్‌లో డకౌట్‌ కాకుండా తప్పించుకోగలిగాడు. అతడు 2006 నుంచి 2012 మధ్య 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 14 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 172 పరుగులు చేశాడు.

మాజీ మహిళా క్రికెటర్​కు అరుదైన గౌరవం- ICC హాల్ ఆఫ్ ఫేమ్​లో భారత ప్లేయర్​కు ప్లేస్

డేంజర్​లో షమీ టెస్ట్​ కెరీర్​! - రీఎంట్రీ ఎప్పుడో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.