Team India World Cup Squad: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ప్లేయర్లకు ఐపీఎల్ ఒక ప్రాక్టీస్ టోర్నమెంట్‌లా ఉపయోగపడింది. అయితే బీసీసీఐ నుంచి వరల్డ్‌కప్ టీమ్ పేర్లు వినిపించకముందు, చెలరేగి ఆడిన వాళ్లు ఎలాగూ జట్టులో పేరు ఉందని తెలిశాక రిలాక్స్ అయిపోయారు. చాలా కొద్ది మందిని మినహాయిస్తే అందరి తంతూ ఇదే. ఓ సారి అందరినీ పరిశీలిద్దాం.
రిషబ్ పంత్: గాయం తర్వాత కోలుకుని మైదానంలోకి అడుగుపెట్టేందుకు 15నెలలు పట్టింది. ఐపీఎల్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన పంత్, తమ జట్టు నాకౌట్ ఆశలు కోల్పోవడం వల్ల కాస్త రిలాక్స్ అయ్యాడు. హాఫ్ సెంచరీలకు మించి స్కోర్లు నమోదు చేసిన పంత్, ప్రపంచ కప్ జట్టు అనౌన్స్ చేసిన తర్వాత అత్యధిక స్కోరు 33 మాత్రమే.
సంజూ శాంసన్: రాజస్థాన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సంజూ తొలి మ్యాచ్‌లోనే 86 పరుగులు చేశాడు. ఆ తర్వాత వరుసగా రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అలా ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకున్నాడో లేదో, తర్వాత ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కసారి మాత్రమే 80+ పరుగులు నమోదు చేశాడు. ఒకసారి డకౌట్ అయ్యాడు కూడా.
హార్దిక్ పాండ్య: పర్సనల్ సమస్యలతో నలిగిపోతున్న పాండ్య ఐపీఎల్‌లో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఓ మాదిరి ప్రదర్శన కనబరిచినా ప్రపంచ కప్‌లో జట్టు దక్కించుకున్నాక పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. వరల్డ్‌కప్ టీమ్ అనౌన్స్ అయ్యాక రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
శివమ్ దూబె: ఐపీఎల్ మొదలైన వెంటనే శివాలెత్తిపోయిన శివమ్ దూబెను చూసి హార్డ్ హిట్టర్ దొరికేశాడని సంబరాలు చేసుకున్నారు. 9 మ్యాచ్‌లలో 360 పరుగులు చేసిన దూబె, చివరి ఐదు మ్యాచ్‌లలో కేవలం 36 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. దీనిని బట్టే తెలుస్తుంది అతనెంత ప్లానింగ్‌తో ఆడాడో.
రింకూ సింగ్: వరల్డ్‌కప్ టీమ్‌లోకి ట్రావెల్ రిజర్వ్‌గా స్థానం దక్కించుకున్న రింకూ, ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 113 బంతుల్లో 168 పరుగులు మాత్రమే చేశాడు.
శుభ్‌మన్ గిల్: ఇక్కడ సీన్ రివర్స్. వరల్డ్‌కప్ టీమ్ అనౌన్స్ అయ్యాక గిల్ సెంచరీ చేశాడు. టీమ్ఇండియా 15మంది స్క్వాడ్‌లో ట్రావెల్ రిజర్వ్‌గా మాత్రమే చోటు దక్కడం వల్ల తానేంటో నిరూపించుకునేందుకు దూకుడుగా ఆడాడు. రెండు మ్యాచ్‌లు రద్దయి మిగిలిన చివరి మ్యాచ్‌లో 104 పరుగులు బాదేశాడు.
సూర్య కుమార్ యాదవ్: వరల్డ్‌కప్ టీమ్‌లో పేరు ప్రకటించకముందు, ప్రకటించిన తర్వాత దాదాపు ఒకేలాంటి ప్రదర్శనతో కనిపించాడు సూర్యకుమార్ యాదవ్. ఐపీఎల్ 2024వ సీజన్‌లో కొడితే హాఫ్ సెంచరీ లేదా ప్లాప్‌గా వెనుదిరగడం కొనసాగించిన సూర్య, హైదరాబాద్ పై సెంచరీ (102) చేసి ముంబయిని గెలిపించాడు. ఒక హాఫ్ సెంచరీ (56) కూడా నమోదు చేశాడు. అంతకంటే ముందు ఆడిన మ్యాచ్ లలో రెండు హాఫ్ సెంచరీ(78), (52)లు కూడా ఉన్నాయి.
యశస్వి జైస్వాల్: ప్లే ఆఫ్స్ స్థాయికి చేరుకున్న రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో జైస్వాల్ ఆ మేర ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. గతేడాది పరుగులు చేయడంలో కనబరిచిన దూకుడు ఈ సీజన్ ఆరంభంలో మాత్రమే కనబరిచాడు. ఒక సెంచరీ కూడా చేశాడు. వరల్డ్‌కప్ కోసం జట్టు ప్రకటించిన తర్వాత 67, 4, 24, 4, 42 పరుగులతో తర్వాత మ్యాచ్‌లలో పరవాలేదనిపించుకున్నాడు.
విరాట్ కోహ్లీ: దంచుడే నినాదంగా సీజన్ మొదలుపెట్టిన కోహ్లీ ఈ సారి సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ దక్కడంలో ఆశ్చర్యం లేదు. 700 పరుగులకు మించిన స్కోరుతో ఆకట్టుకున్నాడు. వరల్డ్ కప్ టీం అనౌన్స్‌మెంట్‌తో సంబంధం లేకుండా ఐపీఎల్‌కు కీలకమైన మ్యాచ్‌లు కావడం వల్ల చివరి మ్యాచ్‌లలో 70, 42,92, 27, 47, 33లతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
రోహిత్ శర్మ: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సారి ఐపీఎల్ ప్రదర్శన అంతగా కనిపించలేదు. వరల్డ్‌కప్ స్క్వాడ్ అనౌన్స్ చేయకముందు ఒక సెంచరీతో పాటు నాలుగు సార్లు 30కి మించి స్కోరు నమోదు చేసిన రోహిత్, జట్టు వెల్లడించిన తర్వాత ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు.
కోచ్ పదవిపై తొలిసారి స్పందించిన గంభీర్- ఏమన్నాడంటే? - Gautam Gambhir India Coach
మా ఫైట్ ఎప్పుడూ చర్చనీయమే- కానీ, ఈసారి అలా కాదు: బాబర్ - T20 World Cup 2024