ETV Bharat / sports

బుమ్రా ఈజ్ బ్యాక్- ఐదో టెస్టుకు భారత్ జట్టు ప్రకటన - Ind vs eng test series 2024

Team India Squad 5th Test: ఇంగ్లాండ్ టెస్టు సిరీస్​లో ఆఖరి మ్యాచ్​కు టీమ్ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. గత మ్యాచ్​లో రెస్ట్ తీసుకున్న బుమ్రా ఐదో టెస్టుతో జట్టులో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

5th TEAM SQUAD
5th TEAM SQUAD
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 3:06 PM IST

Updated : Feb 29, 2024, 3:27 PM IST

Team India Squad 5th Test:ఇంగ్లాండ్​తో జరగనున్న ఐదో టెస్టుకు బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాటర్ కే ఎల్ రాహుల్​ గాయం కారణంగా ఈ టెస్టుకు కూడా ఎంపిక కాలేదు. నాలుగో టెస్టుకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా ఆఖరి మ్యాచ్​లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా, భారత్- ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్టు మ్యాచ్ మార్చి 07న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​కు ధర్మశాల మైదానం వేదిక కానుంది.

ఇక యంగ్ ఆల్​రౌండర్ వాషింగ్టన్ సుందర్​ను జట్టు నుంచి రిలీజ్ చేశారు. సుందర్ 2024 రంజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున సెమీఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ సెమీస్​ మ్యాచ్ మార్చి 02- 06 మధ్య జరగనుంది. ఈ మ్యాచ్​ తర్వాత ఒకవేళ జట్టుకు సుందర్ అవసరమైతే అతడు టీమ్ఇండియాలో చేరతాడని బీసీసీఐ పేర్కొంది. మరోవైపు లండన్​ వైద్యుల పర్యవేక్షనలో ఉన్న రాహుల్ గురించి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ అవుతున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇక సర్జరీ పూర్తి చేసుకున్న పేసర్ మహ్మద్ షమీ త్వరలోనే బెంగళూరు ఎన్​సీఏలో చేరతాడని చెప్పింది.

ఇక స్వదేశంలో జరుగుతున్న భారత్ ఒక మ్యాచ్​ మిగిలుండగానే 3-1తో సిరీస్​ను దక్కించుకుంది. హైదరాబాద్​లో జరిగిన తొలి మ్యాచ్​లో భారత్ ఓడినప్పటికీ, తర్వాత విశాఖపట్టణం, రాజ్​కోట్, రాంచీ టెస్టుల్లో వరుసగా నెగ్గి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఈ క్రమంలో టెస్టుల్లో ఇంగ్లాండ్ బజ్​బాల్ వ్యూహాన్ని అనుసరిస్తున్న తర్వాత తొలిసారి సిరీస్​ను కోల్పోయింది. అటు కెప్టెన్ బెన్​స్టోక్స్​ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టెస్టుల్లో వరుసగా మూడు మ్యాచ్​లు ఓడడం కూడా ఇదే తొలిసారి.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్​మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాష్ దీప్.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్​ - శ్రేయస్​, ఇషాన్​పై వేటు!

లండన్​కు కేఎల్ రాహుల్​ - ఇక ఐదో టెస్ట్​కు డౌటే!

Last Updated : Feb 29, 2024, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.