Team India New Head Coach : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా తన పదవికాలం ముగియనున్న నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్‌స్థానంలో కొత్త వారికి బాధ్యతలు ఇచ్చేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ యాడ్‌ను కూడా తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రట్రీ జై షా వెల్లడించారు.
2021 ఏడాది నవంబర్ నుంచి టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా మాజీ స్టార్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌పదవీ బాధ్యతలు చేప్పటారు. ఇక అప్పటి నుంచి ఆయన పలు ఫార్మాట్లలో భారత జట్టుకు శిక్షణ ఇస్తూ కొనసాగుతున్నారు. ఇక 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ద్రవిడ్ కాంట్రాక్టును పొడిగించారు. కానీ ఈ సారి మాత్రం అటువంటిదేమి లేనట్లు తెలుస్తోంది.
ఇక హెడ్ కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు ఈ జూన్‌తో ముగియనున్నది. సరిగ్గా అదే సమయంలో భారత జట్టు టీ20 వరల్డ్‌కప్‌కు సిద్ధమవుతుంటుంది. ఈ నేపథ్యంలో జూన్ 2024 వరకు ద్రవిడ్ కాంట్రాక్ట్ అందుబాటులో ఉంటుంది. దీంతో ఒకవేళ రాహుల్ కావాలనుకుంటే మరోసారి ఈ పోస్ట్‌కు అప్లై చేయచ్చని, అయితే ఆటోమెటిక్‌గా పొడిగింపు ఉండదంటూ జై షా క్లారిటీ ఇచ్చారు.
"రాహుల్ పదవీ కాలం జూన్ వరకే ఉంది. ఒకవేళ ఆయన దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, చేసుకోవచ్చు. కొత్త కోచ్ భారత్ నుంచి ఉంటారా? విదేశీయుడా? అనేది మేము ఇప్పుడే రివీల్ చేయలేం. క్రికెట్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకే ఉంటుంది. మాకు ప్రత్యేకంగా ఓ విభాగం ఉంది. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లను నియమిస్తారా? లేదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఆ నిర్ణయం కూడా సీఏసీ తీసుకుంటుంది. మా జట్టులో మూడు ఫార్మాట్లు ఆడే క్రికెటర్లు ఉన్నారు. విరాట్, రోహిత్, రిషభ్ పంత్ ఇలా చాలా మంది అన్ని ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు" అంటూ జైషా వెల్లడించారు.
ఇదే వేదికగా ఐపీఎల్‌లో ఇంపాక్ట్ రూల్‌పై వస్తున్న విమర్శల గురంచి స్పందించారు. వాటిపైనా జైషా స్పందించారు. "ఆ రూల్‌ను కేవలం టెస్టింగ్ కోసం ఈ సీజన్‌లో పెట్టాం. ఇలా చేయడం వల్ల కొత్తగా ఇద్దరు భారతీయ క్రికెటర్లకు ఆడే అవకాశం వస్తుంది. బయట నుంచి వస్తున్న కామెంట్లపై మేము మా కమిటీతో త్వరలోనే చర్చిస్తాం. ఇంపాక్ట్ రూల్‌పై తుది నిర్ణయం తీసుకొనే ముందు ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లతోనూ మాట్లాడతాం. ఇవేవీ శాశ్వతం కాదు. రూల్‌పై ఎవరి నుంచి ఇంకా ఫీడ్‌బ్యాక్ రాలేదు" అని షా తెలిపారు.
టీమ్ఇండియా జట్టు ప్రకటించిన బీసీసీఐ - పంత్ ఇన్, రాహుల్ ఔట్ - ICC T20 World Cup 2024
రికీ పాంటింగ్ క్రికెట్ బ్యాట్ కలెక్షన్స్ - గ్యారేజీలో 1000కుపైగా! - IPL 2024