ETV Bharat / sports

సెలక్షన్​ కమిటీతో గంభీర్ మీటింగ్- కెప్టెన్సీ గురించే చర్చ? - Gautam Gambhir Meeting - GAUTAM GAMBHIR MEETING

Gautam Gambhir Meeting: హెడ్​కోచ్ హోదాలో గౌతమ్ గంభీర్ త్వరలోనే సెలక్షన్ కమిటీతో సమావేశం జరపనున్నట్లు తెలుస్తోంది.

Gautam Gambhir Meeting
Gautam Gambhir Meeting (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 10:31 AM IST

Updated : Jul 11, 2024, 12:04 PM IST

Gautam Gambhir Meeting: టీమ్ఇండియా కొత్త హెడ్​కోచ్ గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటనకు ముందే సెలక్షన్ కమిటీతో సమావేశం జరపనున్నట్లు తెలుస్తోంది. తాను హెడ్​కోచ్​ పదవిలో సెలక్షన్ కమిటీతో భేటీ అవ్వడం ఇదే తొలిసారి కానుంది. అయితే ఈ మీటింగ్​లో శ్రీలంక పర్యటన, జట్టు టీ20 ఫార్మాట్​ కెప్టెన్సీపై చర్చించుకోనున్నట్లు సమాచారం.

అయితే టీమ్ఇండియా త్వరలోనే శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టార్​లో 3 టీ20, 3 వన్డే మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. జులై 27 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనకు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీళ్ల గైర్హాజరీలో ఎవరు జట్టను సమర్థంగా నడిపించగలరు? జట్టు ఎంపిక ఎలా ఉండాలన్న అంశాలు సెలక్టర్ల మీటింగ్​లో చర్చించే ఛాన్స్ ఉంది.

హార్దిక్ లేదా రాహుల్
ఈ పర్యటనకు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య ఎంపిక దాదాపు ఖాయం. అయితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు జట్టును నడిపించే అవకాశం ఉంది. దీంతో ఎవరికి కెప్టెన్సీ దక్కుతుందోనని ఆసక్తి నెలకొంది. కాగా, వీరిద్దరికి ఇదివరకు టీమ్ఇండియాకు కెప్టెన్​గా వ్యవహరించిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్​కు హార్దిక్, వన్డే సిరీస్​కు కేఎల్ రాహుల్ జట్టను నడిపించే ఛాన్స్ ఉంది.

శ్రీలంక పర్యటన

తొలి టీ20జులై 27
రెండో టీ20జులై 28
మూడో టీ20జులై 30
తొలి వన్డేఆగస్టు 02
రెండో వన్డేఆగస్టు 04
మూడో వన్డే ఆగస్టు 07
  • ఇక ఈ మ్యాచ్​లకు వేదికలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. టీ20 మ్యాచ్​లు రాత్రి 7 గంటలకు, వన్డే మ్యాచ్​లు 2.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. అటు ఇరుజట్లు కూడా ఇంకా జట్లను ప్రకటించలేదు.

శాలరీ ఎంతంటే?
కాగా, గంభీర్ భారీ మొత్తంలో శాలరీ అందుకోనున్నాడని పలు కథనాలు వస్తున్నాయి. ఏడాదికి రూ.12- 15కోట్లు శాలరీ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక విదేశీ పర్యటనలకు రోజుకు రూ. 21వేలు డైలీ అలవెన్స్​ రూపంలో బోర్డు చెల్లించనుందని టాక్. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ, సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతోంది.

లంకతో సిరీస్​ - టీమ్​ఇండియా టీ20 జట్టు కెప్టెన్​ ఎవరంటే? - IND VS Srilanka T20 Series

గంభీర్ గ్యారేజీలో ఉన్న​ లగ్జరీ కార్లు ఇవే - అతడి నెట్​వర్త్​ ఎన్ని కోట్లో తెలుసా? - Gautam Gambhir Networth

Last Updated : Jul 11, 2024, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.