ETV Bharat / sports

లిఫ్ట్​ ఎక్కలేని హార్దిక్ - ఒంటరిగా ఉండలేని సూర్య - మన క్రికెటర్ల ఫోబియాలేంటో తెలుసా? - CRICKETERS PHOBIA

టిమ్​ఇండియా క్రికెటర్ల ఫోబియాలు- మనోళ్లకు అవంటే చచ్చేంత భయాలట!

Cricketers Phobia
Cricketers Phobia (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 1, 2024, 3:48 PM IST

Indian Cricketers Phobia : మనుషుల్లో కొందరికి రకరకాల ఫోబియాలు ఉంటాయి. అందులో కొన్ని చూసేవారికి చిత్రంగానూ అనిపిస్తుంటాయి. అయితే తమ ఆటతో యావత్‌ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మన క్రికెటర్లుకూ ఫోబియాలు ఉన్నాయట. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం పలు విషయాలకు భయపడతారట. మరి మనోళ్లలో ఎవరెవరికి ఫోబియా ఉంది? వాళ్ల భయాలు ఏంటో మనం కూడా తెలుసుకుందామా!

కెప్టెన్​​కు అదంటే చిన్నప్పట్నుంచే భయం
కెప్టెన్ రోహిత్‌ శర్మకు చిన్నప్పట్నుంచీ నీళ్లలో మునగడమంటే భయం అంట. ఆ సమయంలో ఊపిరి బిగపట్టడమంటే ప్రాణం పోయినట్టుగానే అనిపిస్తోందని రోహిత్ చెప్పాడు. నీళ్లలోకి కొట్టుకుపోతానేమో అని భయం ఉంటుందని తెలిపాడు. ఆ ఫోబియా ఎందుకు వచ్చిందో తెలియదని, దానిని అధిగమించడానికి ఈత కూడా నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు. ఈత కొలనులో మునగడం ప్రాక్టీస్‌ చేసినా, నదులూ, సముద్రాల వద్ద మాత్రం ఈ సాహసం ఎప్పటికీ చేయలేనని అన్నాడు. కానీ సముద్ర తీరాల్లో గడపడం, ఇసుకలో పిచ్చుక గూళ్లు కట్టుకోవడం తనకెంతో ఇష్టమని చెప్పారు.

కోహ్లీకి అదంటే భయం
విమానం కదిలేటప్పుడు తనకు భయమేస్తుందని భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. విమానం ఎక్కిన తర్వాత టేక్‌ఆఫ్‌ అయ్యేటప్పుడో, దిగేప్పుడో ఒకరకమైన భయం ఉంటుందని తెలిపాడు. అలానే కొన్నిసార్లు టర్బులెన్స్‌ వల్ల విమానం అటూ ఇటూ ఊగిన సమయంలో తనకు చచ్చేంత భయమేస్తుందని పేర్కొన్నాడు. ఆ టైంలో సీటును చేతులతో గట్టిగా పట్టుకుంటానని అన్నాడు. కానీ, తన పక్కన కూర్చున్న వాళ్లంతా ఏమాత్రం భయపడకుండా ఎవరి పనుల్లో వాళ్లుంటారని, వాళ్లను చూస్తే అంత ధీమాగా ఎలా ఉంటారా అనిపిస్తుంటుందని అన్నాడు. కొన్నేళ్లుగా విమానంలో తిరుగుతున్నప్పటికీ ఆ ఫోబియా నుంచి బయట పడలేకపోతున్ననని తెలిపాడు. అంతేకాదు, విమానం ఎక్కినట్టు కల వచ్చినా కూడా నాకు ఆందోళనగానే ఉంటుందని అన్నాడు.

పాండ్యకూ ఓ ఫోబియా
హార్దిక్‌ పాండ్యాకు లిఫ్ట్​లో వెళ్లాలంటే బాగా భయమంటా. ఒకవేళ లిఫ్ట్​లో వెళ్లాలంటే ఎవరోకరు తోడుండాల్సిందే అని అంటున్నాడు. లిఫ్ట్​లో వెళ్లేటప్పుడు సడెన్​గా ఆగిపోతే లోపల ఇరుక్కుపోవాల్సి వస్తుందని అందుకే ఒంటరిగా వెళ్లడానికి సాహసం చేయనని చెప్పాడు. ఎవరూ లేకపోతే మెట్లు ఎక్కుతాడంట. ఇక ఇంజక్షన్​ అంటే కూడా హర్దిక్ పాండ్యకు భయమంటా. ప్రాక్టీస్‌ వల్ల గాయాలై, సర్జరీలు చేయించుకోవాల్సిన సమయంలో చాలా కష్టంగా ఉంటుందని, సూదిని చూసినా కంగారొస్తుందని అన్నాడు.

సూర్యకుమార్‌ అలా ఉండలేడట
సూర్యకుమార్‌ యాదవ్‌కు ఒంటరిగా ఉండటం అంటే భయం అని చెప్పాడు. ఒంటరిగా ఉంటే ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయని, అందుకే ఎప్పుడు తన చుట్టూ ఎవరో ఒకరు ఉండాల్సిందేనట. ఇంట్లో దేవిషా (భార్య) లేనప్పుడు కొన్ని సార్లు తనకు అలాంటి సందర్భాలు ఎదురయ్యాయని, ఆ రోజంతా ఏదో ఆందోళనగా అనిపించేదని పేర్కొన్నాడు. అందుకే దానికో పరిష్కారమార్గం కనిపెట్టి కుక్కల్ని పెంచడం మొదలుపెట్టాడంట సూర్య కుమార్. ఇంట్లో ఎవరూ లేకపోయినా పాబ్లో, ఓరియోతో ఆడుకుంటే సమయం తెలియకుండానే గడిచిపోతుందని, ఒంటరిగా ఉన్నాననే భావనా కలగదని తెలిపాడు.

సంజూకి అలా ఉండడం కష్టమే
కొంచెం చీకటిగానూ, అటూ ఇటూ కదలకుండా కట్టేసినట్టుండే వాతావరణం అంటే తనకు భయమని సంజూ శాంసన్‌ చెప్పాడు. అలా ఉంటే ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తుందని, చెమటలు పట్టేస్తాయని అన్నాడు. సినిమా థియేటర్లలోనూ, ఏసీ బస్సుల్లోనూ, ఏసీ ట్రైన్‌ కంపార్ట్‌మెంట్లలో, క్యూ లైన్లలోనూ ఇలాంటి వాతావరణం కనిపిస్తుందని అందుకే తాను రద్దీగా ఉండే చోటుకు వెళ్లనని పేర్కొన్నాడు. అయితే థియేటర్‌లో వినోదం వల్ల ఆ ఫోబియాని పోగొట్టుకోవచ్చుగానీ, ప్రయాణంలోనే చాలా కష్టంగా ఉంటుందని అన్నాడు. ఇప్పుడిప్పుడే దాన్ని దూరం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సంజూ తెలిపాడు.

క్రికెట్​లో న్యూ ఫ్యాబ్ 4- ఫ్యూచర్​లో ఈ కుర్రాళ్లదే హవా! - Next Generation Fab 4

టీమ్ఇండియాలో ఈ క్రికెటర్లు వెరీ రిచ్ - వీరికి సొంత జెట్​లు కూడా! - Indian Cricketers Private Jet

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.