T20 Worldcup 2024 Teamindia VS Afghanisthan : ఆఫ్గానిస్థాన్ చేతుల్లో ఓడిన మాజీ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియాతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడనుంది. సెమీస్ చేరాలంటే ఆసీస్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. అయితే ఈ మ్యాచ్ వేదికైన సెయింట్ లూసియాలో వాతావరణం పెద్దగా అనుకూలంగా కనిపించడం లేదు.
ఈ పోరుకు వర్షం పెద్ద సమస్యగా కనిపిస్తోంది. 50 శాతం వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఆస్ట్రేలియాకు పెద్ద సమస్యగా మారింది. రోజు మొత్తం వర్షం పడే అవకాశం 65 శాతంగా ఉండట. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. ఆ సమయానికి వర్షం లేకపోయినా కూడా మేఘావృతమై ఉండనుందని వాతావరణ శాఖ అంటోంది. కాబట్టి వర్షం వల్ల ఈ గేమ్ కోల్పోతే ఆస్ట్రేలియా ఇంటికి వెళ్లడం ఖాయం.
మ్యాచ్ రద్దైతే పరిస్థితేంటి ? - ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైతే టీమ్ఇండియా, ఆస్ట్రేలియాకు చెరొక పాయింట్ కేటాయిస్తారు. ఎందుకంటే రిజర్వ్ డే లేదు. అప్పుడు టీమ్ఇండియా సెమీఫైనల్ వెళ్తుంది. అటు ఆస్ట్రేలియా ఖాతాలో 3 పాయింట్ల ఉంటాయి. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్థాన్ ఓడిపోతేనే ఆస్ట్రేలియా సెమీస్ చేరుతుంది.
అదే ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ గెలిస్తే నాలుగు పాయింట్లతో ముందడుగు వేస్తుంది. ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే బంగ్లాదేశ్ చేతిలో అఫ్గాన్ ఓడిపోతే ఆస్ట్రేలియా నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ బెర్త్‌ను కన్ఫార్మ్ చేసుకుంటుంది. అఫ్గాన్, బంగ్లాదేశ్ రెండు పాయింట్లకే పరిమితం అవుతాయి. ఇది కంగారూలకు కలిసొస్తుంది.
కాగా, టీ20 వరల్డ్ కప్ తొలి సీజన్ అయిన 2007 వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకున్న టీమిండియా ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మరో టైటిల్ ఈసారి కచ్చితంగా గెలుచుకోవాలనే కసిలో కనిపిస్తుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో గ్రూప్ దశ నుంచి సూపర్ 8 దశ వరకూ టీమిండియా టాప్ పొజిషన్‌లోనే కొనసాగుతోంది.