Syed Mushtaq Ali Trophy : ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తాజాగా ఓ సెన్సేషనల్ రికార్డు నమోదైంది. టీ20 క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా బరోడా క్రికెట్ జట్టు అద్భుత పెర్ఫామ్ చేసి టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డుకెక్కింది. దీంతో పాటు ఈ మ్యాచ్‌లో బరోడా టీమ్ మరెన్నో కొత్త రికార్డులు కూడా సృష్టించింది.
గురువారం బరోడా, సిక్కిం జట్లు తలపడ్డాయి. బరోడా ఓపెనర్లు శాశ్వత్ రావత్, అభిమన్యు సింగ్ రాజ్‌పుత్ విధ్వంసకరంగా బ్యాటింగ్ చేసి జట్టును ముందుకు నడిపించారు. అయితే ఆరో ఓవర్లో జట్టు తొలి వికెట్ పడింది. అప్పటికి జట్టు స్కోరు 92 పరుగులకు చేరుకుంది. దీంతో కేవలం 17 బంతుల్లోనే 53 పరుగులు చేసి అభిమన్యు ఔటయ్యాడు. ఈ స్కోర్‌లో 5 సిక్సర్లు, 4 ఫోర్లు ఉండటం విశేషం.
మరో ఓపెనర్ శాశ్వత్ రావత్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతుల్లో 43 పరుగులు జోడించాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన భాను పునియా మరింత దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో అతడు 51 బంతుల్లో 134 పరుగులు స్కోర్ చేశాడు. అందులో 15 సిక్సర్లు, 5 ఫోర్లు ఉండటం విశేషం.
ఆ రికార్డు కూడా
ఇదిలా ఉండగా, 20 ఓవర్లు ముగిసే సరికి బరోడా జట్టు స్కోరు 349 పరుగులకు చేరింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఫార్మాట్‌లో ఓ జట్టు ఇంత భారీ స్కోరు చేయడం ఇదే తొలిసారి. అంతే కాదు ఈ మ్యాచ్‌లో బరోడా మొత్తం 37 సిక్సర్లను నమోదు చేసింది. అయితే టీ20 ఫార్మాట్‌లో ఓ జట్టు ఇలా అత్యధిక సిక్సర్లు నమోదు చేయడం కూడా ఓ రికార్డే. కొద్ది రోజుల క్రితం జింబాబ్వే, గాంబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్‌లో 27 సిక్సర్లు కొట్టింది.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్లు
- జింబాబ్వే - 344/4 vs గాంబియా, 2024
- నేపాల్- 314/3 vs మంగోలియా, 2023
- భారత్- 297/6 vs బంగ్లాదేశ్, 2024
- జింబాబ్వే- 286/5 vs సీషెల్స్‌పై 2024
- అఫ్గానిస్థాన్- 278/3 vs ఐర్లాండ్‌పై, 2019
- చెక్ రిపబ్లిక్- 278/4 vs తుర్కియేపై, 2019
ఒకే ఇన్నింగ్స్‌లో 11 మంది బౌలింగ్- ఇది టీ20 హిస్టరీలోనే సంచలనం!
ఐపీఎల్ 2025 వేలంలో అన్‌సోల్డ్ - ఇప్పుడేమో టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డ్