MS Dhoni IPL 2025: టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లలో మహేంద్రసింగ్ ధోనీ ఒకరు. భారత్‌కు వన్డే, టీ 20 ప్రపంచకప్‌లు అందించిన మిస్టర్ కూల్ కెప్టెన్. టీమ్ ఇండియాను విజయ పథంలో నడిపించిన ధోనీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు కూడా అయిదుసార్లు ట్రోఫీని అందించాడు. ఐపీఎల్‌లో ధోనీ మైదానంలోకి దిగుతున్నాడంటే చాలు ఆ స్టేడియాలన్నీ పసుపు రంగు పోసుకుని పోటెత్తేవి. తన సారథ్యం, ప్రశాంతత, వ్యూహాలు, కీపింగ్ నైపుణ్యాలతో ధోనీ క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే 43ఏళ్ల ధోనీ ఇప్పుడు మరో ఐపీఎల్ సీజన్‌లో ఆడుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ధోనీ మరోసారి బరిలోకి దిగితే చూడాలాని అభిమానులు అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ధోనీ ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ధోనీ సహచరుడు, టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ వచ్చే ఐపీఎల్ ఆడడంపై తన మనోభావాలు వ్యక్తం చేశాడు.
రైనా ఏమన్నాడంటే?
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025లో ఆడాలన్న తన బలమైన కోరికను సురేశ్ రైనా వ్యక్తం చేశాడు. గత ఏడాది ధోనీ ఆటతీరు చూసి అతడు ఈ ఏడాది కూడా ఆడాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. 'MS ధోనీ ఐపీఎల్ 2025లో ఆడాలని నేను కోరుకుంటున్నాను' అని రైనా పేర్కొన్నాడు. గత IPL సీజన్‌లో ధోనీ దూకుడైన బ్యాటింగ్‌తో అలరించాడు.
గతేడాది ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి వైదొలిగినా, ఆటగాడిగా మాత్రం కొనసాగాడు. కొన్ని మ్యాచుల్లో ధోనీ కీలక పాత్ర పోషించాడు. ప్రశాంతంగా ఉండే ధోనీకి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. 'ఎంఎస్ ధోనీ గత సంవత్సరం ఎలా బ్యాటింగ్ చేశాడో అందరూ చూశారు. ఆ బ్యాటింగ్ చూశాక ఐపీఎల్ 2025లో మళ్లీ ధోనీ ఆడాలని నేను కోరుకుంటున్నాను' అని రైనా తన మనసులోని మాట బయటపెట్టాడు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా వర్దమాన ఆటగాళ్లకు ధోనీ మార్గదర్శకత్వం అవసరమని రైనా అభిప్రాయపడ్డాడు.
రిటైర్‌మెంట్?
ఈ ఐపీఎల్‌లో ధోనీ ఆడకపోవచ్చని అతడు రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో సురేశ్ రైనా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ధోనీ ఐపీఎల్‌లో ఆడడంపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయలేదు. చెన్నై జట్టుకి ధోనీ అవసరం కేవలం విజయాల కోసం మాత్రమే కాదని జట్టులో స్ఫూర్తి నింపేదుకు మార్గనిర్దేశం చేసేందుకు తలైవా అవసరం ఉందని రైనా అన్నాడు. అయితే ధోనీ ఐపీఎల్ ఆడడం అతని శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మోకాలి సమస్యతో బాధపడుతున్న ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.
ఇండిపెండెన్స్ డే రోజే ధోనీ, రైనా రిటైర్మెంట్- అప్పుడే ఎందుకంటే? - MS Dhoni Retirement
యువరాజ్ సింగ్, హర్భజన్, రైనాపై పోలీస్ కంప్లైంట్ - Police Complaint on EX Cricketers