Shubman Gill LBW vs Eng: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ చాలా దాదాపు 13 ఇన్నింగ్స్ తర్వాత టెస్టుల్లో సెంచరీ బాదాడు. ఇంగ్లాండ్‌పై ఆడిన తాజా ఇన్నింగ్స్‌తో తనపై వస్తున్న విమర్శలకు గిల్ చెక్ పెట్టాడు. జట్టు ఆపదలో ఉన్నప్పుడు అక్షర్ పటేల్‌తో మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కు మంచి స్కోర్ (255) కట్టబెట్టాడు. టీమ్ఇండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో దాదాపు 50 శాతం పరుగులు కూడా శుభ్మన్వే కావడం విశేషం. దీంతో ఇన్నిరోజులుగా అతడిపై వస్తున్న విమర్శలు కాస్త ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో ప్రశంసలుగా మారాయి. అయితే ఈ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ తన వికెట్ కాపాడాడని గిల్ చెప్పాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన గిల్, ఈ సెంచరీ తనకెంతో సంతోషాన్నిచ్చిందని అన్నాడు. అయితే సెంకడ్ ఇన్నింగ్స్‌లో గిల్ ఎదుర్కొన్న ఏడో బంతికే ఔటయ్యే ప్రమాదంలో పడ్డాడు. స్పిన్నర్ హార్ట్లీ వేసిన బంతి గిల్ ప్యాడ్స్‌కు తగిలింది. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు అప్పీల్ చేయడం వల్ల అంపైర్ అది ఔట్‌గా ప్రకటించాడు. గిల్ రివ్యూ కోరడం వల్ల రిప్లైలో బంతి బ్యాట్‌ను తగిలినట్లు తేలింది. దీంతో గిల్ ఊపిరి పీల్చుకున్నాడు. దీనిపై గిల్ మాట్లాడుతూ 'ఆ బంతి బ్యాట్‌ను తాకిందని నేను అనుకోలేదు. రివ్యూ తీసుకోమని అయ్యర్ చెప్పాడు. ఒకవేళ అంపైర్స్ కాల్ అయినా ఫర్వాలేదన్నాడు. అప్పటికీ నేను డౌట్‌గానే రివ్యూకి వెళ్లా. రిప్లైలో బంతి, బ్యాట్‌ను తాకినట్లు తేలింది. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డా' అని గిల్ అన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, 28-0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా 255 పరుగులకు ఆలౌటైంది. గిల్ 11 ఫోర్లు, 2 సిక్స్‌లు సహా 104 పరుగులు బాదాడు. అక్షర్ పటేల్ (45 పరుగులు) రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (13), శ్రేయస్ అయ్యర్ (29), రజత్ పటీదార్ (9), కే ఎస్ భరత్ (6) మరోసారి విఫలమయ్యారు. ఇక మూడో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ 67-1తో నిలిచింది. విజయానికి భారత్‌కు 9 వికెట్లు అవసరం కాగా, ఇంగ్లాండ్‌కు 332 పరుగులు కావాలి.
గిల్ బ్యాక్ టు ఫామ్- సూపర్ సెంచరీతో విమర్శలకు చెక్
రోహిత్, కుల్దీప్ ఫన్నీ మూమెంట్- మీమర్స్‌కు మంచి స్టఫ్ ఇచ్చారుగా!