Bumrah Test Records 2024 : అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సాధించాడు. 2024లో టెస్టుల్లో 50 వికెట్ల మార్క్ అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసి ఈ రికార్డు నెలకొల్పాడు.
మూడో పేసర్‌గా
అలాగే ఓ క్యాలెండర్ ఇయర్‌లో టెస్టులో 50వికెట్లు పడగొట్టిన మూడో భారత పేసర్‌గా బుమ్రా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ ఘనత కపిల్ దేవ్, జహీర్ ఖాన్ మాత్రమే అందుకున్నారు. కాగా, 31 ఏళ్ల బుమ్రా ఈ ఏడాది ఆడిన 11 టెస్టులో 50 వికెట్లు నేలకూల్చాడు. ఎకానమీ రేటు 3మాత్రమే ఉండడం గమనార్హం.
ఆగిన ఫ్లడ్ లైట్లు
మరోవైపు, ఈ డే/నైట్ టెస్టులో ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఫ్లడ్ లైట్లు ఆటకు అంతరాయం కలిగించాయి. టీమ్ఇండియా బౌలర్ హర్షిత్ రాణా వేసిన ఓ ఓవర్‌లో ఫ్లడ్ లైట్లు రెండుసార్లు ఆగిపోయాయి. దీంతో ఈ యువ పేసర్ అ సంతృప్తికి గురైనట్లు వీడియోలో కనిపించింది.
'ఎవరో ఆపినట్లుంది'
ఆసీస్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో ఫ్లడ్ లైట్లు రెండుసార్లు ఆగిపోయాయి. దీంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. 'ఎవరో స్విచ్ ఆఫ్ చేసినట్లుగా ఉంది' అని ఆన్ ఎయిర్ కామెంటేటర్ ఆ సమయంలో వ్యాఖ్యానించారు.
He Does It 🙌@Jaspritbumrah93 gets the first wicket for #TeamIndia
— BCCI (@BCCI) December 6, 2024
Live ▶️ https://t.co/upjirQCmiV#AUSvIND pic.twitter.com/gF3sJgHHwV
180కే ఆలౌట్
అడిలైడ్ టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో టీమ్ఇండియా 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (42; 54 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (37; 64 బంతుల్లో, 6 ఫోర్లు), శుభ్ మన్ గిల్ (31; 51 బంతుల్లో, 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (22; 22 బంతుల్లో, 3 ఫోర్లు), రిషభ్ పంత్ (21; 35 బంతుల్లో, 2 ఫోర్లు) రాణించారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోరు అందుకోలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ (6/48) విజృంభించాడు. ప్యాట్ కమిన్స్ (2/41), స్కాట్ బొలాండ్ (2/54) రాణించారు.
భారత్ x ఆస్ట్రేలియా - స్టార్క్ దెబ్బకు 180కే టీమ్ఇండియా ఆలౌట్!