ETV Bharat / sports

స్మృతి, విరాట్ జెర్సీ నెంబరే కాదు - ఆ విషయంలో ఇద్దరిదీ సేమ్ రూట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 9:30 AM IST

Updated : Mar 1, 2024, 10:46 AM IST

Smriti Virat Co Incident: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన ఇద్దరూ నెం.18 జెర్సీతోనే బరిలోకి దిగుతారు. అయితే జెర్సీ నెంబరే కాదు, ఓ విషయంలో ఇద్దరికీ ఒకేలా జరిగింది. ఇంతకీ అదేంటంటే?

Smriti Virat Co Incident
Smriti Virat Co Incident

Smriti Virat Co Incident: భారత క్రికెట్​లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన ఫ్యాన్ ఫాలోయింగ్​ వేరు. ఐపీఎల్​లో విరాట్, డబ్ల్యూపీఎల్​లో స్మృతి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరపున ప్రాతినిధ్యం వహించడం వల్ల వీరిద్దరి ఫ్యాన్స్​ మ్యూచువల్​గానే ఉంటారు. ఇక పురుషుల క్రికెట్​లో విరాట్ జెర్సీ నంబర్, మహిళల క్రికెట్​లో స్మృతి జెర్సీ నంబర్​ కూడా ఒకటే. వీరిద్దరూ నెం.18 జెర్సీతోనే బరిలోకి దిగుతారు. అయితే ప్రస్తుతం వీరి మధ్య మరో విషయం కూడా కో ఇన్సిడెంట్​గా మారింది. అదేంటంటే?

టీమ్ఇండియా ప్లేయర్ స్మృతి మంధాన ప్రస్తుతం డబ్ల్యూపీఎల్​లో ఆడుతోంది. గురువారం బెంగళూరు వేదికగా దిల్లీ- ఆర్​సీబీ మ్యాచ్​లో స్మృతి రఫ్పాడించింది. 43 బంతుల్లోనే 74 పరుగులు బాది ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించింది. డబ్ల్యూపీఎల్​ కెరీర్​లో స్మృతికి ఇది తొలి హాఫ్ సెంచరీ. అయితే తొలి సీజన్​లో స్మృతి 50+ స్కోర్ చేయలేదు. అటు పురుషుల క్రికెట్​ ఐపీఎల్​ తొలి సీజన్​లో విరాట్​ కోహ్లీ కూడా ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు.

అయితే అటు విరాట్ ఐపీఎల్​లో, ఇటు స్మృతి డబ్ల్యూపీఎల్​లో ఇద్దరు కూడా రెండో సీజన్​లోనే తొలి ఫిఫ్టీ నమోదు చేశారు. రెండో సీజన్​లో మూడో మ్యాచ్​లోనే వీరిద్దరూ ఈ ఫీట్ అందుకున్నారు. అది కూడా దిల్లీ జట్టుపైనే తొలి హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. దీంతో వీరిద్దరి విషయంలో జెర్సీ నెం.18 కనెక్షన్ అలాంటిదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఆర్​సీబీ- దిల్లీ మ్యాచ్​లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ హై స్కోరింగ్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్​కు ఫుల్ మజానిచ్చింది. ఇక టోర్నీలో వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్న ఆర్​సీబీ జోరుకు దిల్లీ బ్రేకులు వేసింది. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఛేదనలో ఆర్​సీబీ దూకుడుగా ఆడుతూ ఓ దశలో గెలిచేలా కనిపించింది. కానీ, ఆఖర్లో దిల్లీ బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టి ఆర్​సీబీకి విజయాన్ని దూరం చేశారు.

హై స్కోరింగ్ మ్యాచ్​లో దిల్లీ థ్రిల్లింగ్ విన్- స్మృతి పోరాటం వృథా

బ్యాటింగ్ మెరుపులు- ఫీల్డింగ్ విన్యాసాలు- IPL రేంజ్​ కిక్కిస్తున్న WPL

Last Updated : Mar 1, 2024, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.