ETV Bharat / sports

బాధ లేదు సంతోషమే - రిటైర్మెంట్​పై సాయి ప్రణీత్ - షట్లర్ సాయి ప్రణీత్ రిటైర్మెంట్

Shuttler Sai Praneeth Retirement : ప్రముఖ తెలుగు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్స్ కాంస్య పతక విజేత బీ సాయి ప్రణీత్ (31) అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను పంచుకున్నాడు. అతని మాటల్లోనే ఏం చెప్పాడో విందాం.

బాధ లేదు సంతోషమే - రిటైర్మెంట్​పై సాయి ప్రణీత్

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 6:19 AM IST

Updated : Mar 5, 2024, 9:42 AM IST

Shuttler Sai Praneeth Retirement : చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌తో పిచ్చి ప్రేమతో రాకెట్‌ను తన ఆయుధంగా మార్చుకుని కెరీర్​లో అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకంతో సత్తాచాటి సీనియర్‌ స్థాయిలోనూ దూసుకెళ్లాడు. అలా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఈ కాంస్య మెడల్ దక్కించుకుని 36 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించాడు. అయితే కెరీర్‌ మంచి ఫుల్​ ఫామ్​లో ఉండగా మధ్యలో కరోనా, ఆ తర్వాత గాయాలు బాగా ఇబ్బంది పెట్టాయి. దీంతో తిరిగి కోలుకోలేకపోయాడు. అయినా తనకేమీ బాధ లేదని, సాధించిన దానితో సంతృప్తిగా ఉన్నానని అంటూ బ్యాడ్మింటన్‌కు గుడ్​బై చెప్పేసి అందరినీ షాక్​కు గురి చేశాడు తెలుగు షట్లర్ సాయి ప్రణీత్. ఈ సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను పంచుకున్నాడు.

ఇప్పుడే ఆటకు వీడ్కోలు ఎందుకు పలికారు? ఇదే సరైన సమయమని ఎందుకు అనిపించింది?

కరోనా బ్రేక్​, ఆ తర్వాత గాయాలు నన్ను వెనక్కిలాగాయి. మళ్లీ బెస్ట్ పెర్ఫామెన్స్​ చేయాలని ప్రయత్నించినా అవ్వలేదు. అందుకే ఇక చాలని అనుకుని సంతృప్తితోనే ముగించా.

మీకున్న స్కిల్స్​కు టాలెంట్​కు తగ్గట్లుగా సక్సెస్​ సాధించలేకపోయారనే అభిప్రాయం ఉంది. మీరేం అంటారు?

బహుశా కావొచ్చేమో! నేను సరిగ్గా ప్రయత్నించకపోయి ఉంటే సరైన సమాధానం వచ్చేది. ఫలితం అనుకున్నట్లు రాకపోవచ్చు. కానీ నేను కష్టపడ్డాను. మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడమే నా చేతుల్లో ఉంది. గెలిచానా లేదా అన్నది కాదు. నా వరకు కష్టపడుతూనే వచ్చాను. ఏది రావాలో అదే వచ్చిందని అనుకుంటున్నాను. అందుకే ఎలాంటి బాధ లేదు. నా కెరీర్‌ పట్ల సంతోషంగా ఉన్నా.

మీ కెరీర్‌లో ది బెస్ట్ పెర్ఫామెన్స్​ అంటే ఏం చెబుతారు?

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మెడల్​ గెలవడం, సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ దక్కించుకోవడం, ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడం నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతాయి.

ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో నిరాశ కలిగించిన క్షణాలున్నాయా?

నా ఈ 24 ఏళ్ల క్రీడా జర్నీ కచ్చితంగా నిరాశ కలిగించిన సందర్భాలు ఉన్నాయి. అలా అని నేనెప్పుడు ఆటను నిర్లక్ష్యం చేయలేదు. నిరాశ కలిగిన ప్రతిసారి మరింత కష్టపడి, పుంజుకోవడానికి మాత్రమే ప్రయత్నించాను.

మీ జర్నీలో ఫ్యామిలీ, గోపీచంద్‌ పాత్ర ఎలాంటి?

ఫ్యామిలీ సపోర్ట్​ లేకపోయి ఉంటే నా కెరీర్‌ ఇక్కడివరకూ వచ్చేదే కాదు. ఇక గోపి అన్న అన్నీ తానై చూసుకున్నారు. ఇప్పటివరకూ ఫ్యామిలీతో కన్నా కూడా గోపి అకాడమీలోనే ఎక్కువ సమయం గడిపానేమో!

కోచ్‌గా కొత్త ప్రయాణం ఎలా ఉండబోతోంది?

కొత్త పాత్ర కదా కోచ్‌గా కొత్త కెరీర్‌ స్టార్ట్ చేసేందుకు ల ఉత్తేజితంగా ఉన్నాను. సెట్​ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. నాకు ఆసక్తి ఉంది కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకున్నా. వచ్చే నెలలో అమెరికా వెళ్లి ట్రయాంగిల్‌ బ్యాడ్మింటన్‌ క్లబ్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నా.

సింధు, శ్రీకాంత్‌, సైనాతో మీ అనుబంధం ఎలాంటిది?

అందరితో మంచి బంధం ఉంది. కానీ ఎవరి కెరీర్‌లు వాళ్లది కదా. ఎప్పుడో ఒకసారి దూరమవ్వాల్సిందే. వీళ్లను, హైదరాబాద్‌ను కచ్చితంగా మిస్సవుతాను. కానీ లైఫ్​లో ముందుకు సాగాలంటే కొన్ని నిర్ణయాలు తప్పవు.

చివరగా యువ షట్లర్లకు మీరిచ్చే సందేశం?

కష్టపడాలంతే. అదృష్టం అనేది ఉండదు. కష్టపడితేనే అదృష్టమనేది వస్తుంది. చివరి వరకూ పట్టు వదలకుండా పోరాడాలి. ఆటను ఆస్వాదించాలి.

WPL 2024 - దంచికొట్టిన ఆర్సీబీ - యూపీ వారియర్స్​పై విజయం

పోరాటంలో మానసిక ఒత్తిడి ఎక్కువైంది - రెజ్లింగ్​కు తిరిగి రాలేను : సాక్షి మాలిక్​

Last Updated : Mar 5, 2024, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.