Shubman Gill Injury Update : ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి జరగనున్న తొలి టెస్టుకు ముందు టీమ్ఇండియాకు శుభ్‌మన్ గిల్ గాయం ఓ పెద్ద షాక్‌నిచ్చింది. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతడి ఎడమ చేతికి గాయమవ్వగా, ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో రెండవ రోజు మైదానానికి తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే శుభ్‌మన్ ఫిట్‌నెస్‌పై టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తాజాగా ఓ కీలక సమాచారాన్ని అందించారు.
"శుభ్‌మన్ రోజురోజుకు మెరుగుపడుతున్నాడు. మేము టెస్ట్ జరగనున్న ఉదయం మళ్లీ ఓ సారి పరీక్షిస్తాం. అతడు బిల్డ్-అప్ సమయంలో మ్యాచ్ సిమ్యులేషన్‌లో బాగా ఆడాడు. అంతా మంచి జరగాలని అనుకుంటున్నాను " అని మోర్కెల్ మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా చెప్పాడు.
ఇక సిమ్యులేషన్ మ్యాచ్‌లో, గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసి నవదీప్ సైనీ వేసిన బంతిని గల్లీ వద్ద క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగి 42 అజేయ పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 14 మ్యాచ్‌లలో, గిల్ 42.09 సగటుతో 926 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు అలాగే మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి, ఇందులో అత్యధిక స్కోరు 119*. ఇక ఈ ఏడాది అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 19 ఇన్నింగ్స్‌లలో 47.41 సగటుతో 806 పరుగులు స్కోర్ చేశాడు.