ETV Bharat / sports

నితీశ్‌కు గాయం - అతడికి చోటు - Nitish kumar Injured - NITISH KUMAR INJURED

Indian Team for Zimbabwe Series Nitish kumar Injured : యువ ఆల్‌రౌండర్‌, తెలుగు క్రికెటర్ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి నిరాశ. టీమ్‌ఇండియా తరపున అరంగేట్రం కోసం ఈ విశాఖ ఆల్‌రౌండర్‌ మరింత కాలం ఎదురు చూడక తప్పదు. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Nitish kumar (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 6:39 AM IST

Updated : Jun 27, 2024, 6:59 AM IST

Indian Team for Zimbabwe Series Nitish kumar Injured : అంతర్జాతీయ క్రికెట్‍లో టీమ్​ఇండియా తరఫున అరంగేట్రం చేసేందుకు ఎదురుచూసిన తెలుగు ప్లేయర్, సన్‍రైజర్స్ హైదరాబాద్ స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి మరింత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీసెంట్​గానే టీమ్​ఇండియాలో అతడికి చోటు దక్కింది. జులైలో జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‍కు నితీశ్‍ను సెలెక్టర్లు సెలెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు అతడికి నిరాశ ఎదురైంది. అతడు గాయం బారిన పడ్డారు. దీంతో అతను ఈ 5 టీ20ల సిరీస్‌కు దూరమవ్వాల్సి వచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ అఫీషియల్​గా ప్రకటించింది.

"జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన నితీశ్ కుమార్ గాయపడ్డాడు. అతడి స్థానంలో శివమ్‌ దూబెను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది" అని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది.

ఇక నితీశ్ స్థానంలో వరల్డ్ కప్​లో ఆడుతున్న శివమ్‌ దూబెను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరపున ఆడిన 21 ఏళ్ల నితీశ్‌ 303 పరుగులతో ఆకట్టుకున్నాడు. 142.92 స్ట్రైక్‍రేట్‍తో దూకుడు ప్రదర్శించాడు. కీలకమైన సమయాల్లో బ్యాటింగ్‍తో దుమ్మురేపాడు. అలాగే 13.1 ఓవర్లు వేసిన అతడు మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఎమర్జింగ్ ప్లేయర్‌గానూ అవార్డు అందుకున్నాడు. దీంతో అతడికి టీమ్​ఇండియా నుంచి పిలుపు వచ్చింది. కాగా, బీసీసీఐ యంగ్ ప్లేయర్స్​ టార్గెట్‌ గ్రూప్‌లో ఉన్న నితీశ్‌ గత ఏడాది కాలంగా నేషనల్​ క్రికెట్‌ అకాడమీ పర్యవేక్షణలో ఉన్న సంగతి తెలిసిందే.

షెడ్యూల్ ఇదే - వచ్చే నెల 6న తొలి టీ 20 జరుగనుంది. జూలై 7న రెండో మ్యాచ్, జూలై 10న మూడో టీ20, జులై 13న నాలుగో మ్యాచ్ జరగున్నాయి. జులై 14న జరిగే ఐదో టీ20తో ఈ పర్యటన ముగుస్తుంది.

భారత జట్టు : శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రుతురాజ్, అభిషేక్‌ శర్మ, రింకు సింగ్, శాంసన్, ధ్రువ్‌ జూరెల్, శివమ్‌ దూబె, రియాన్‌ పరాగ్, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్, ముకేశ్‌ కుమార్, తుషార్‌ దేశ్‌పాండే.

ఒకే ఓవర్లో 43 పరుగులు- 134ఏళ్ల చరిత్రలో రికార్డ్

అప్పుడు ధోని వికెట్‌ తీయడమే నా లక్ష్యం : అశ్విన్‌ - R Ashwin About MS Dhoni

Last Updated : Jun 27, 2024, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.