Shikhar Dhawan Net Worth : టీమ్‌ఇండియాలో శిఖర్ ధావన్ శకం ముగిసింది. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు ఈ స్టార్ క్రికెటర్ అనూహ్యంగా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అయితే వీడ్కోలు ప్రకటన వల్ల ఇప్పడు ధావన్ వద్ద ఉన్న ఆస్తుల విలువ ఎంత అనే దానిపై చర్చ మొదలైంది. అయితే శిఖర్ అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకరని పలు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
ధావన్ మొత్తం సంపద దాదాపు రూ. 96 కోట్లు ఉంటుందని అంచనా. విలాసవంతమైన కార్లు, ఇళ్లు, లగ్జరీ వాచ్‌లు శిఖర్ దగ్గర ఉన్నాయి. దిల్లీలో రూ.5 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది. అదే కాకుండా ఆస్ట్రేలియాలోనూ ధావన్‌కు ఓ భవంతి ఉంది. శిఖర్ గ్యారేజ్‌లో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
శిఖర్ ధావన్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతని వద్ద అనేక ప్రసిద్ధ బ్రాండ్ల వాచీలు ఉన్నాయి. ధావన్ వద్ద రూ. 72 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ వాచ్ ఉంది.
ధనిక క్రికెటర్లలో ఒకడు
ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో శిఖర్ ధావన్ పేరు కూడా ఉంది. ధావన్ ప్రధాన ఆదాయ వనరులు BCCI, ఐపీఎల్ కాంట్రాక్టులు, అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా కూడా ధావన్ భారీగానే ఆర్జిస్తున్నాడని సమాచారం.
ఇక ధావన్‌ను బీసీసీఐ గ్రేడ్-ఏ కేటగిరీ ఆటగాళ్లలో చేర్చింది. దీని ద్వారా ధావన్ ఏటా రూ. 5కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించాడు. ఇది కాకుండా భారత్ తరఫున ఆడే ప్రతి టెస్టు మ్యాచ్‌కు రూ. 15లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ. 6లక్షలు, టీ20 మ్యాచ్‌లకు రూ. 3లక్షలుగా తీసుకున్నాడని సమాచారం. 2022 ఐపీఎల్ వేలంలో ధావన్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 8.25కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 2023 ఐపీఎల్‌లో కూడా అదే ధరకే అతడ్ని కొనసాగించారు.
కోట్ల విలువైన ఆస్తులు
- శిఖర్ ధావన్‌కు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. శిఖర్‌కు ఆస్ట్రేలియాలో ఇల్లు ఉంది. 2015లో ఈ ఇంటిని 7,30,000 డాలర్లకు ధావన్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ధావన్ మాజీ భార్య అయేషా ఈ ఇంట్లోనే నివసిస్తోంది.
- శిఖర్ ధావన్‌కు దిల్లీలో రూ. 5కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది. శిఖర్‌కి ఖరీదైన వాచీలు ధరించడం అంటే చాలా ఇష్టం. అతని వద్ద కోరమ్, ట్యాగ్ హ్యూయర్ వంటి బ్రాండ్‌ల వాచీలు ఉన్నాయి.
- శిఖర్ ధావన్ దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో ఒకటి BMW M8 Coupe, దీని ధర సుమారు రూ. 2.25 కోట్లు. ఇది కాకుండా ఆడి ఏ6, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు కూడా ధావన్ గ్యారేజ్‌లో ఉన్నాయి.
క్రికెట్‌కు శిఖర్ ధావన్ గుడ్‌బై- రిటైర్మెంట్ ప్రకటించిన 'గబ్బర్' - Shikhar Dhawan Retirement
వైరల్‌గా కేఎల్ రాహుల్ ఇన్‌స్టా పోస్ట్ - రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? - KL Rahul Retirement