Shamar Joseph Westindies Player : సొంత గడ్డపై తమను ఓడించేవారే లేరన్నట్లు విర్రవీగిపోయిన ఆస్ట్రేలియా జట్టుకు గుణపాఠం చెప్పింది విండీస్ సేన. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆసీస్ జట్టును 8 పరుగుల తేడాతో ఓడించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టుల్లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
అయితే విండీస్ జట్టు ఇంతటి విజయాన్ని సాధించడంలో ఓ యంగ్ ప్లేయర్ కృషి ఉంది. అతడెవరో కాదు 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్. మ్యాచ్ మూడో రోజు గాయపడి ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్న ఆ ప్లేయర్, నాలుగో రోజు మైదానంలోకి దిగి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును నడింపించాడు. తన బౌలింగ్ స్కిల్క్తో ప్రత్యర్థులను చిత్తు చేసి విండీస్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. వరుసగా 12 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లను పడగొట్టాడు. అలా చివరి వికెట్ కూడా జోసెఫ్ ఖాతాలోకే వచ్చింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్టులో అరంగేట్రం చేసిన జోసెఫ్, ఆ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ సాధించి, గబ్బాలో 68 పరుగులకు 7 వికెట్లు తీసి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నడు. అయితే ఈ యంగ్ సెన్సేషన్ క్రికెట్ జర్నీ అంత ఈజీగా
గయానాకు చెందిన షమర్ మూడేళ్ల క్రితం వరకు తన జీవనోపాధి కోసం సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. ఆటపై మక్కువ ఉన్నప్పటికీ అతడికి కుటుంబ సభ్యుల మద్దతుతో పాటు సరైన సౌకర్యాలు లభించలేదు. దీంతో బౌలింగ్ ప్రాక్టీస్ చేసేందుకు పండ్లను ఉపయోగించేవాడు. అప్పుడప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లను కరిగించి వాటితో బంతులు తయారు చేసుకుని ఆడుకునేవాడు.
ఆ తర్వాత క్రమక్రమంగా టెన్నిస్ బంతులతో బౌలింగ్ చేయడం నేర్చుకున్నాడు. అతని పేస్, ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ కారణంగా, అతడికి గయానా తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది. దీంతో ఒక్కసారిగా అతడి రేంజ్ మారిపోయింది. ఇక గయానా తరపున ఆడుతున్న సమయంలో తన అద్భుతమైన ఆటతీరుతో పలువురి దృష్టిలో పడ్డాయు. అలా 2023లో కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో నెట్ బౌలర్‌గా చోటు సంపాదించాడు. దీని తర్వాత గయానా అమెజాన్ వారియర్స్ జట్టులోనూ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇలా వరుస ఛాన్సులు వరించగా, అతడు తన కెరీర్లో వెనక్కితిరిగి చూసుకోలేదు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లోని మొదటి టెస్టుతోనే షమర్ జోసెఫ్ అరంగేట్రం చేశాడు. తన మొదటి బంతికే స్టీవ్ స్మిత్ లాంటి దిగ్గజ బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. అరంగేట్రం టెస్టులోనే 5 వికెట్లతో పాటు అర్ధశతకం సాధించాడు. గబ్బాలోనూ అదే ట్రెండ్‌ను కొనసాగించి ఆస్ట్రేలియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.
విండీస్ గెలుపుపై రియాక్షన్ - స్టేడియంలో కన్నీళ్లు పెట్టుకున్న బ్రియాన్ లారా
'గబ్బా'లో విండీస్ నయా హిస్టరీ- ఆసీస్ గడ్డపై 27 ఏళ్ల తర్వాత విక్టరీ