Saurabh Netravalkar T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌లో అమెరికా జట్టు, పాక్ లాంటి సీనియర్ టీమ్‌లతో తలపడటం ఇదే మొదటిసారి. అయితేనేం ఆ మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. ఈ విజయం వెనక ఉన్నది మాత్రం భారత్‌కు చెందిన యంగ్ ప్లేయర్ సౌరభ్ నేత్రావల్కర్. గురువారం (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను అద్భుతంగా కట్టడి చేశాడు. అత్యంత పొదుపైన బౌలింగ్‌తో నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. వేసిన తొలి మూడు ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి పాక్ ప్లేయర్లను భయపెట్టాడు. మరీ ఈ స్టార్ ప్లేయర్ కెరీర్ ఎలా మొదలైందంటే?
ముంబయి నుంచి అమెరికా దాకా : 1991 అక్టోబర్ 16న ముంబయిలో జన్మించాడు వైభవ్. చిన్న వయసు నుంచే క్రికెట్‌పై ఉన్న ఆసక్తి వల్ల అండర్-19 టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ టోర్నీలో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సందదీప్ శర్మ స్టార్స్‌తో కలిసి ఆడాడు. అంతే కాకుండా ముంబయి తరపున కొన్ని రంజీ ట్రోఫీల్లోనూ ఆడాడు. కానీ భారత జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు.
23 ఏళ్ల వయసులో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. అయితే తన మనసు ఇంకా క్రికెట్ మీదే ఉండటం వల్ల అమెరికా క్రికెట్ టీమ్‌లో కష్టపడి స్థానం దక్కించుకున్నాడు. అలా అమెరికా తరపున తొలిసారి మైదానంలోకి దిగి యునైటెడ్ అరబ్ ఎమరైట్స్ జట్టులో తలపడ్డాడు. అమెరికా టీమ్‌కు కొంతకాలం కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇప్పటి వరకు ఈ స్టార్ క్రికెటర్ 48 వన్డేలు, 29 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
14 ఏళ్ల క్రితం ఓటమికి ఇప్పుడు ప్రతీకారం :
2010లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ జట్టులో టీమ్ఇండియా తరపున ఆడిన వైభవ్ ఆ టోర్నీలో ఎక్కువగా వికెట్లు తీసిన ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయినా ఆ టోర్నీలో భారత జట్టు పాక్ చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పాక్ ఆడే అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు వైభవ్. నాలుగు ఓవర్లలో 18 పరుగులే చేసేలా చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు.
పసికూనల చేతిలో ఓటమి - పాక్‌కు ఇదేం కొత్త కాదు! - T20 World Cup 2024