Sara Tendulkar Shubman Gill Sister:క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమార్తె సారా, యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్ గిల్ ఒకే కారులో కనిపించడం ఇంటర్నెట్లో హాట్ టాపిగ్గా మారింది. వీరిద్దరూ ముంబయిలో శనివారం రాత్రి కలిసి కారులో వెళ్తుండగా కెమెరాకు చిక్కారు. కొందరు ఆమె కారు చుట్టుముట్టి ఫొటోలు తీస్తుండగా సారా నవ్వుతూ ఫేస్ కవర్ చేసుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. పక్కనే గిల్ సోదరి మాస్క్ ధరించి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో మరోసారి సారా తెందూల్కర్, శుభ్‌మన్ గిల్ రిలేషన్లో ఉన్నరన్న పుకార్లు మరోసారి తెరపైకి వచ్చాయి.
-
Sara Tendulkar with Shubham Gill 's sister Shahneel 😁🤨#ShubmanGill #SaraTendulkar pic.twitter.com/U7WVP7LD6g
— Unfunny Hoon 🫡 (@Unfunny_hun) January 20, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sara Tendulkar with Shubham Gill 's sister Shahneel 😁🤨#ShubmanGill #SaraTendulkar pic.twitter.com/U7WVP7LD6g
— Unfunny Hoon 🫡 (@Unfunny_hun) January 20, 2024Sara Tendulkar with Shubham Gill 's sister Shahneel 😁🤨#ShubmanGill #SaraTendulkar pic.twitter.com/U7WVP7LD6g
— Unfunny Hoon 🫡 (@Unfunny_hun) January 20, 2024
అయితే కొంత కాలంగా సారా తెందూల్కర్, శుభ్‌మన్ గిల్ రిలేషన్షిప్లో ఉన్నరని సోషల్ మీడియాలో వార్తలు వైరలయ్యాయి. వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గిల్ హాఫ్ సెంచరీ చేయగానే గ్యాలరీలో ఉన్న సారా తెందూల్కర్ సంబరాలు చేసుకోవడం వల్ల ఈ రూమర్స్ ఇంకా ఎక్కువయ్యాయి. అయితే అవన్నీ పూకర్లేనని సమాచారం.
హీరోయిన్ సారాతో! సారా తెందూల్కర్ కాకుండా గిల్, బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్‌తో డేటింగ్లో ఉన్నాడని మరికొన్ని కథనాలు వచ్చాయి. దీనిపై ఆమె రీసెంట్గా పాల్గొన్న కాఫీ విత్ కరణ్ (Coffee With Karan) షోలో క్లారిటీ ఇచ్చింది. 'సారా అనగానే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచం మొత్తం రాంగ్ (Wrong) సారా వెనుక పడుతోంది. ఆ సారా నేను కాదు' అని చెప్పింది.
Shubman Gill Cricket: యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గతేడాది (2023) అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 2000+ పరుగులు చేశాడు. 2023లోనే వన్డేల్లో డబుల్ సెంచరీతో పాటు ఐపీఎల్లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక వన్డే వరల్డ్‌కప్‌లోనూ 354 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం గిల్ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. జనవరి 25న ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ప్రారంభం కానుంది.
'మాకు ఇంకో ఛాన్స్ ఉంది'- వరల్డ్‌కప్‌పై రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చారిత్రక విజయానికి మూడేళ్లు- 'గబ్బా' విక్టరీపై బీసీసీఐ స్పెషల్ ట్వీట్