Sania Divorced Shoaib: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన మాజీ భర్త షోయబ్ మాలిక్‌కు కొన్ని నెలల ముందే విడాకులు ఇచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం (జనవరి 20) షోయబ్, పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను మూడో పెళ్లి చేసుకున్న తర్వాత సానియా ఫ్యామిలీ మెంబర్స్ డివోర్స్ మ్యాటర్ బయటపెట్టారు.
'సానియా తన పర్సలైల్ లైఫ్‌ను గోప్యంగానే ఉంచుతుంది. అందుకే ఆమె షోయబ్‌కు కొన్ని నెలల ముందే విడాకులు ఇచ్చిన విషయాన్ని ఈరోజు చెప్పాల్సి వస్తోంది. కొత్త జీవితం ప్రారంభించిన షోయబ్‌కు సానియా శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఆమె జీవితంలో ఇది చాలా సెన్సిటివ్ పీరియడ్. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్, వెల్ విషర్స్ ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతున్నాం' అని సానియా కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇక షోయబ్‌కు ఇది మూడో పెళ్లి. అతడు తొలిసారి 2002లో ఆయేషా సిద్ధిఖిని పెళ్లాడాడు. ఆమెకు 2010లో విడాకులు ఇచ్చి, అదే ఏడాదిలో ఏప్రిల్‌లో సానియాను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 2018లో ఇజహాన్ (కుమారుడు) జన్మించాడు. కొంత కాలంగా సానియా, షోయబ్ విడిపోనున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ జంట అప్పట్లో దీనిపై స్పందించలేదు. అయితే తాజాగా సానియా స్పందించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఓ పోస్ట్ షేర్ చేసింది.'పెళ్లి కష్టం, విడిపోవడం కష్టం. మీ కష్టాన్ని తెలివిగా ఎంచుకోవాలి' అని రాసుకొచ్చింది. దీంతో సానియా తన డివోర్స్ విషయాన్ని పరోక్షంగా తెలిపింది. అయితే కుమారుడు ఇజహాన్ ప్రస్తుతం సానియాతోనే ఉంటున్నాడు. అటు సనా జావేద్‌కు ఇది రెండో వివాహం. 2020లో ఆమె పాక్ సింగర్‌ను పెళ్లి చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది కాలానికి విడిపోయారు.
-
- Alhamdullilah ♥️
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
"And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV
">- Alhamdullilah ♥️
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024
"And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV- Alhamdullilah ♥️
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024
"And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV
Sania Mirza Retirement: 37 ఏళ్ల సానియా గతేడాది టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా టెన్నిస్ ఆడిన సానియా అనేక రికార్డులు సాధించింది. ఆమె డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్స్‌లో 6 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గింది.
ఎట్టకేలకు గెలిచిన పాక్- 'అష్రఫ్' రాజీనామాతో జట్టుకు మంచి రోజులు!