ETV Bharat / sports

' మీకు అస్సలు ఏమీ తెలియదు'- ధోనీకి స్టంపింగ్​ రూల్స్‌ నేర్పించిన సాక్షి! - SAKSHI TEACHES CRICKET TO DHONI

ఫన్నీ ఇన్సిడెంట్!- ధోనీకి క్రికెట్‌ రూల్స్‌ చెప్పించిన సాక్షి!

Sakshi Teaches Cricket To Dhoni
Dhoni Sakshi (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 30, 2024, 9:26 AM IST

Sakshi Teaches Cricket To Dhoni : టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ మైదానంలోనే కాదు, బయట కూడా అభిమానులను ఇట్టే ఆకర్షిస్తుంటాడు. హెలికాప్టర్‌ షాట్‌లు, మెరుపు వేగంతో చేసే స్టంపింగ్‌లు, కూల్‌గా ఉండే విధానానికే కాదు, హాస్యం చేయడంలోనూ ధోని పాపులర్‌. ధోనీ ఇటీవల ఓ కార్యక్రమంలో భార్య సాక్షితో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిండెట్‌ని షేర్‌ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ధోనీ మాట్లాడుతూ, రన్ అవుట్, స్టంపింగ్ గురించి సాక్షికి, అతడికి మధ్య జరిగిన సరదా సన్నివేశాన్ని వివరించాడు.

ధోని షేర్‌ చేసుకున్న స్టోరీ ఇదే
"ఓ రోజు నేను, సాక్షి ఓ క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తున్నాం. దాదాపుగా ఇంట్లో మా మధ్య ఎప్పుడూ క్రికెట్‌ గురించి చర్చలు జరగవు. అయితే ఆ రోజు మ్యాచ్‌లో ఓ ఇన్సిడెంట్‌ జరిగింది. బౌలర్‌ బాల్‌ వేసినప్పుడు వైడ్‌ వెళ్లింది. అయితే ముందుకొచ్చి ఆడిన బ్యాటర్‌ బాల్‌ మిస్‌ అవ్వడం వల్ల కీపర్‌ స్టంప్‌ ఔట్​ చేశాడు. రివ్యూ తీసుకుని కూడా ప్రయోజనం లేదని తెలిసిన బ్యాటర్‌ పెవిలియన్‌కి వెళ్లిపోతున్నాడు. అప్పుడు సాక్షి, బ్యాటర్‌ నాటౌట్‌ అని, అంపైర్‌ నిర్ణయం తప్పని చెప్పింది. అంతేకాదు కొద్ది సేపట్లే థర్డ్‌ అంపైర్‌ బ్యాటర్‌ని వెనక్కి పిలుస్తాడని చాలా నమ్మకంగా చెప్పింది. వైడ్‌ బాల్‌లో స్టంపింగ్‌ ఉండదని చెప్పింది. అప్పుడు నేను వైడ్‌ బాల్‌కి స్టంపింగ్‌ ఉంటుంది, నో బాల్‌కి ఉండదని చెప్పాను. అప్పటికే నెక్స్ట్‌ బ్యాటర్‌ బౌండరీ వద్దకు చేరుకున్నాడు. అప్పుడు సాక్షి, మీకు క్రికెట్‌ గురించి ఏం తెలియదు అంది. నెక్స్ట్‌ బ్యాటర్‌ క్రీజలోకి వచ్చాక, అంపైర్‌ తప్పు చేశాడని అన్నది." అని వివరించాడు. కార్యక్రమానికి హాజరైన వాళ్లంతా ఈ స్టోరీ విని నవ్వుకున్నారు. ముఖ్యంగా ధోనీకి క్రికెట్‌ గురించి తెలియదని సాక్షి అందని చెప్పినప్పుడు అందరూ నవ్వు ఆపులేకపోయారు.

2025 ఐపీఎల్ ఆడుతాడా?
కొంత కాలంగా ఎంఎస్‌ ధోనీ 2025 ఐపీఎల్ ఆడుతాడా? లేదా? అని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ ఊహాగానాలకు ధోనీ తనదైన శైలిలో స్పందించాడు. అభిమానులకు నేరుగా సమాధానం ఇవ్వకుండా, మరికొన్ని సంవత్సరాలు క్రికెట్‌ని ఆస్వాదించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌, క్రీడాభిమానులు ధోనీ మరికొంత కాలం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కొనసాగుతాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

2025 IPLలో ధోనీ- క్లారిటీ ఇచ్చేసిన చెన్నై ఓనర్!

'అది చాలా కష్టమైంది!' : IPL 2025 ఆడటంపై క్లారిటీ ఇచ్చిన ధోనీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.