ETV Bharat / sports

'దీన్ని మేం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం'- రషీద్ ఎమోషనల్ ట్వీట్ - T20 world cup 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 12:24 PM IST

Updated : Jun 27, 2024, 12:45 PM IST

Sa vs Afg T20 Semis 2024: 2024 టీ20 వరల్డ్​కప్ సెమీఫైనల్​లో సౌతాఫ్రికా చేతిలో అఫ్గానిస్థాన్ ఓడింది. దీంతో తొలిసారి ఐసీసీ ఈవెంట్​లో ఫైనల్​ చేరాలన్న అఫ్గాన్ ఆశలు ఆవిరయ్యాయి.

Sa vs Afg T20
Sa vs Afg T20 (Source: Associated Press)

Sa vs Afg T20 Semis 2024: 2024 టీ20 వరల్డ్​కప్​లో అఫ్గానిస్థాన్ అద్భుత జర్నీ ముగిసింది. గురువారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్​లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలిసారి పొట్టికప్పు టోర్నీలో ఫైనల్​కు చేరాలన్న అఫ్గాన్ కల చెదిరింది. దీంతో అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్​తోపాటు జట్టు ప్లేయర్లంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీనిపై మ్యాచ్ అనంతరం రషీద్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

'ఈ వరల్డ్​కప్​ను మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మా జట్టులో ప్రతి ఒక్కరు అద్భుతంగా పోరాడారు. వారి పట్ల నిజంగా గర్వంగా ఉంది. ఈ ఓటమి నుంచి నేర్చుకొని వచ్చే సీజన్​లో గొప్పగా కమ్​బ్యాక్ ఇస్తాం. టోర్నీలో మాకు మద్ధతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని ట్వీట్​లో రాసుకొచ్చాడు.

'ఇది మా రోజు కాదు. మేం ఇంతకంటే గొప్పగా ఆడగలం. కానీ, ఇవాళ పరిస్థితులు మాకు అనుకూలించలేదు. ఏది ఏమైనా ఈ వరల్డ్​కప్​ను మేం ఆస్వాదించాం. సెమీఫైనల్​ వరకు రావడం సంతోషానిచ్చింది. కీలక పోరులో బలమైన ప్రత్యర్థితో ఓడిపోయామని ఒప్పుకుంటా. ఈ టోర్నీలో మా ప్రదర్శన అద్భుతం. మేం ఏ జట్టునైనా ఓడించగలం అన్న విశ్వసం వచ్చింది. వచ్చే ఎడిషన్​లో మరింత దృఢమైన జట్టుగా ఎంట్రీ ఇస్తాం' అని రషీద్ మ్యాచ్ అనంతరం అన్నాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, బ్యాటింగ్​లో అఫ్గాన్ పూర్తిగా విఫలమైంది. 11.5 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. 10 పరుగులు చేసిన అజ్మతుల్లా టాప్​ స్కోరర్. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్​కే పరిమితమయ్యారు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సన్, షంసీ చెరో 3, రబాడా, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం సౌతాఫ్రికా 8.5 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ వరల్డ్​కప్​లో అఫ్గాన్ సంచలన విజయాలు నమోదు చేసింది. గ్రూప్ దశలో బలమైన న్యూజిలాండ్ ఓడించి, సూపర్- 8కు మర్గం సుగమం చేసుకుంది. ఇక సూపర్- 8లో భయంకర ఆస్ట్రేలియాను అద్భుత పోరాటంతో మట్టికరిపించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సెమీస్ చేరాలంటే బంగ్లాదేశ్​తో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్​లో సూపర్ విక్టరీ కొట్టి తామను తక్కువ అంచనా వేయోద్దని ప్రపంచ క్రికెట్​కు హెచ్చరించింది. అలా అఫ్గాన్ ఆల్​రౌండ్ ప్రదర్శనతో సెమీస్​దాకా చేరి ఔరా అనిపించింది.

అఫ్గాన్ ఇంటికి- దక్షిణాఫ్రికా ఫైనల్​కు - T20 Worldcup 2024 Semifinal

ఫైనల్​కు దూసుకెళ్లేదెవరో- ఎవరు నెగ్గినా ఫస్ట్​ టైమ్

Last Updated : Jun 27, 2024, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.