RCB Retention List 2025 IPL : 2025 ఐపీఎల్ రిటెన్షన్స్‌కు 24 గంటల సమయం కూడా లేదు. గురువారం సాయంత్రం 5.00 గంటలలోపు అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని జట్లు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్లపై ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రిటైన్ చేసుకున్న ప్లేయర్ల గురించి ఫ్యాన్స్‌కు ఓ హింట్ ఇచ్చింది.
సోషల్ మీడియాలో ఓ పజిల్ షేర్ చేసింది. 'మా రిటెన్షన్స్ రహస్యంగా ఉన్నాయి. ఈ ఆధారాలను అర్థం చేసుకుని కోడ్‌ను ఛేదించగలరా? మా మాస్టర్ ప్లాన్‌ని కనుక్కోండి' అంటూ పోస్టుకు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పజిల్‌లో విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్, విల్ జాక్స్, కామెరూన్ గ్రీన్, యశ్ దయాళ్, మహ్మద్ సిరాజ్, రజత్ పటిదార్, అనుజ్ రావత్ పేర్లు ఉన్నాయి. అయితే వీరిలో నుంచే ఆర్సీబీ కొంతమందిని అట్టిపెట్టుకునే ఛాన్స్ ఉంది.
𝗧𝗵𝗲 𝘁𝗿𝘂𝘁𝗵 𝗶𝘀 𝗻𝗼𝘁 𝗮𝗹𝘄𝗮𝘆𝘀 𝘄𝗵𝗮𝘁 𝘆𝗼𝘂 𝘀𝗲𝗲. 𝗜𝘁 𝗶𝘀 𝗮𝗯𝗼𝘂𝘁 𝘄𝗵𝗮𝘁 𝘆𝗼𝘂 𝗮𝗰𝘁𝘂𝗮𝗹𝗹𝘆 𝘄𝗮𝗻𝘁 𝘁𝗼 𝘀𝗲𝗲. 👀
— Royal Challengers Bengaluru (@RCBTweets) October 30, 2024
Sneak peek alert! 🚨
Our retentions are shrouded in mystery, waiting for you to uncover. Can you decipher the clues and crack the… pic.twitter.com/lLu5MZ3UI8
ఒక్కసారి ఆర్సీబీ అయితే, ఎప్పటికీ ఆర్సీబీనే!
'2024లో మా ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ స్క్వాడ్‌లోని కొంతమంది వచ్చే ఏడాది జట్టుతో ఉండకపోవచ్చు. కానీ, మనం కలిసి సృష్టించుకున్న జ్ఞాపకాలు ఎప్పటికీ బంధిస్తాయి. లవ్ యూ ఆల్' అని 2024 ఐపీఎల్ సందర్భంగా ఆర్సీబీ జట్టు దిగిన గ్రూప్ ఫొటోను షేర్ చేసింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా తమ జట్టు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల పేర్లను అంచనా వేస్తున్నారు.
రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్స్ 2025 (అంచనా)
- విరాట్ కోహ్లీ
- మహ్మద్ సిరాజ్
- డూప్లెసిస్
- కామెరూన్ గ్రీన్
గరిష్ఠంగా ఒక్కో జట్టు ఆరుగురి (RTM కార్ట్‌తో)ని అట్టిపెట్టుకోవచ్చును.
- తొలి ప్లేయర్ - రూ.18 కోట్లు
- రెండో ప్లేయర్- రూ. 14 కోట్లు
- మూడో ప్లేయర్- రూ. 11 కోట్లు
- నాలుగో ప్లేయర్- రూ. 18 కోట్లు
- ఐదో ప్లేయర్- రూ. 11 కోట్లు
- అన్క్యాప్డ్ ప్లేయర్‌కు రూ. చెల్లించాల్సి ఉంటుంది
కాగా, నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ తొలి వారంలో మెగా వేలం జరగనుందని టాక్.
Once a Royal Challenger, always a Royal Challenger! 💪
— Royal Challengers Bengaluru (@RCBTweets) October 30, 2024
Immense gratitude to our incredible Class of 2024 for the unforgettable journey we’ve shared. ❤️
While some of these special faces may no longer be part of the squad next year, the memories we’ve created will forever bind… pic.twitter.com/jzzFtCHKcz
'పంత్ వేలంలోకి వస్తే రూ.30 కోట్లు పక్కా- రాసి పెట్టుకోండి!'
శ్రేయస్‌ను సంప్రదించని కేకేఆర్ ఫ్రాంచైజీ! - ఇక జట్టుకు దూరమేనా!