Rohit Sharma Vs Eng Test 2024: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ సబా కరీమ్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రోహిత్ కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుూ ఆకట్టుకుంటున్నాడని కరీమ్ అన్నాడు. ఈ సిరీస్‌లో టీమ్ఇండియా ఆపదలో ఉన్నప్పడల్లా రోహిత్ జట్టును ఆదుకున్నాడని తెలిపాడు. హిట్‌మ్యాన్ సవాళ్లను ఎదుర్కోవడాన్ని ఆస్వాదిస్తాడని ప్రశంసించాడు.
'రాజ్‌కోట్ టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రోహిత్ క్రీజులో నిలబడ్డాడు. అద్భుతంగా పోరాడి శతకం బాదాడు. ఆ మ్యాచ్‌లో ఎదురైన సవాళ్లను రోహిత్ ఆస్వాదిస్తూ బ్యాటింగ్ చేశాడు. ఇక ప్రస్తుత మ్యాచ్ తొలిరోజు మార్క్ వుడ్ రెచ్చగొట్టే ప్రయత్నంలో షార్ట్ బంతులు వేసిన టెంప్ట్ అవ్వకుండా ఒపిగ్గా ఆడాడు. అది ఒక అనుభవజ్ఞుడైన ప్లేయర్‌కు ఉండే లక్షణం. ఇక స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ దూరమైన ప్రస్తుత సిరీస్‌లో కుర్రాళ్లతోనే రోహిత్ టీమ్ఇండియాను నడిపిస్తున్న తీరు అద్భుతం. ఏకంగా ఐదుగురు ప్లేయర్లు ఈ సిరీస్‌తో అరంగేట్రం చేయడం కెప్టెన్ పనిభారాన్ని, ఒత్తిడిని పెంచుతుంది. కానీ, రోహిత్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రెండు పాత్రలు విజయవంతంగా పోషిస్తున్నాడు' అని అన్నాడు.
అతడికే దక్కాల్సింది: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ నైట్ రోహిత్ నాయకత్వ లక్షణాలను మెచ్చుకున్నాడు. అయితే రోహిత్ అద్భుతందా జట్టును నడిపించినా ఈ సిరీస్‌లో అతడికి రావాల్సిన క్రెడిట్ రాలేదని అభిప్రాయపడ్డాడు.'నేను ముందుగా రోహిత్ గురించి మాట్లాడుతాను. అతడి బ్యాటింగ్ గురించి మాట్లాడే పని లేదు. ఎందుకంటే ప్రస్తుతం అతడి ఫామ్గురించి మనకు తెలుసు. కానీ, నేను రోహిత్లోని నాయకుడి పాత్రను ఎంచుకుంటా. సీనియర్ ప్లేయర్ల గైర్హాజరీలో, 5గురు డెబ్యూ కుర్రాళ్లతో ఆడటం ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. ఈ అరంగేట్ర ప్లేయర్ల నుంచి ఎవరిని ఎంచుకోవాలి? డ్రెస్సింగ్ రూమ్‌లో వారితో ఎలా వ్యవహరించాలి? ఇదంతా పెద్ద సవాల్, ఒత్తిడితో కూడుకున్నది. అంత ఒత్తిడిలోనూ రోహిత్ జట్టను నడిపించిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది' అని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ నైట్ అన్నాడు.
-
Of hundreds and celebrations! 👏 🙌
— BCCI (@BCCI) March 8, 2024
Rohit Sharma 🤝 Shubman Gill
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ImRo45 | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/yTZQ4dAoEe
రోహిత్, గిల్ సెంచరీల మోత- భారీ స్కోర్ దిశగా భారత్
'అప్పట్లో ఒకడుండేవాడు'- డకెట్ కామెంట్స్‌కు రోహిత్ స్ట్రాంగ్ రిప్లై