ETV Bharat / sports

'ఈ ఓటమికి వారిద్దరు మాత్రమే బాధ్యులు కాదు - దీన్ని మరీ అంతగా పోస్టుమార్టం చేయాల్సిన అవసరం లేదు' - INDIA VS NEW ZEALAND TEST SERIES

ట్రోలర్స్​కు రోహిత్ స్ట్రాంగ్​ కౌంటర్ - 'న్యూజిలాండ్ సిరీస్​ ఓటమికి వారు మాత్రమే బాధ్యులు కారు'

Rohit Sharma IND VS NZ Test Series
Rohit Sharma (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 27, 2024, 8:51 AM IST

Rohit Sharma IND VS NZ Test Series : సుమారు 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ రోహిత్ సేన ఓటమిని చవి చూసింది. తొలి టెస్టు ఓటమిని ఎదుర్కొని ఈ సారైనా గెలుస్తుందనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది. ముఖ్యంగా ఈ సిరీస్​లో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ విభాగం మరోసారి దారుణంగా విఫలమైంది. మరోవైపు న్యూజిలాండ్ స్పిన్నర్లు విజృంభించిన పిచ్‌పై భారత బౌలర్లు అనుకున్నంత పెర్ఫార్మ్ చేయలేకపోయారు. ఇప్పటికే ఈ ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ, సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపైనా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. పరాజయాన్ని మరీ అంతగా పోస్టుమార్టం చేయాల్సిన అవసరం లేదంటూ ట్రోలర్స్​ను చురకలు అంటించాడు.

"తొలి ఇన్నింగ్స్‌లో మేం సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేదు. అయితే పిచ్‌ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. వారి ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ స్కోరుకు మేము దగ్గరగా రాలేకపోయాం. కానీ మ్యాచ్‌ ముందుకు సాగే కొద్దీ పిచ్‌లో చాలా మార్పులు వచ్చాయి. గిల్ - యశస్వి పార్ట్​నర్​షిప్ సమయంలో మెరుగైన పరిస్థితిలోనే మేము ఉన్నాం. కానీ, ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయి ఇబ్బంది పడ్డాం కూడా. అయితే ఆ ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమయ్యమనేది కాదనలేని వాస్తవం. గత రెండు టెస్టుల్లోనూ మేం అనుకున్నంతగా ఆడలేకపోయాం. అంతకుముందు వరుసగా 18 సిరీస్‌లను స్వదేశంలో గెలుపొందాం. ఎన్నో సవాళ్లను విసిరిన పిచ్‌లపైన కూడా మేము మా సత్తా చాటాం. చాలా విజయాలు సాధించినప్పటికీ, కొన్నిసార్లు ప్రణాళికలను సరిగ్గా అమలు చేయకపోతే ఓటములు తప్పవు. ఇక్కడ ఎవరి సామర్థంపై మేము సందేహం వ్యక్తం చేయడం లేదు. మరి ఎక్కువగా పోస్టుమార్టం చేయదల్చుకోలేదు. బ్యాటర్లు తమ ప్రణాళికలపై నమ్మకం ఉంచాల్సిన అవరసం ఎంతో ఉంది. న్యూజిలాండ్‌ ప్లేయర్లు కూడా అదే చేశారు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌పై ఇప్పుడు మేము ఎటువంటి ప్లాన్స్ చేయట్లేదు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం మమల్ని ఎంతో బాధించింది. కానీ, దాని గురించి మరీ ఎక్కువగా ఆందోళన చెందటం లేదు. ఒక మ్యాచ్‌లో ఓడిపోవడం అనే విషయంలో జట్టు మొత్తం బాధ్యత ఉంటుంది. కేవలం ఒకరిద్దరిపైనే (జడేజా-అశ్విన్) నెపం నెట్టడం సరైన పద్దతి కాదు. టాప్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్లు ఏదో ఒక మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన ఇవ్వనంత మాత్రాన వారిని పక్కన పెట్టాలని కాదు. వారు గత పదేళ్లలో భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలను అందించారు" అంటూ రోహిత్ ట్రోలర్స్​కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

కివీస్​తో సిరీస్ ఓటమి- భారత్​ WTC ఫైనల్​ ఛాన్స్​లు ఎలా ఉన్నాయంటే?

0,1తో చెేతులెత్తేసిన రోహిత్, కోహ్లీ - కీలక మ్యాచుల్లో కుర్రాళ్లపై భారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.