KKR New Mentor 2025: మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడం వల్ల ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ పోస్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 2024 సీజన్లో జట్టును సరైన మార్గంలో నడిపించిన గంభీర్, కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇటీవల అతడు టీమ్ఇండియా కోచ్‌గా వెళ్లడం వల్ల కేకేఆర్ జట్టుకు గుడ్‌బై చెప్పాడు.
దీంతో ఆ ప్లేస్‌ను సరైన సరైన వ్యక్తితో భర్తీ చేయాలని కేకేఆర్ యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ జాక్వెస్ కలీస్‌తో మేజేజ్మెంట్ సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. అయితే తాజాగా ఈ పోస్ట్ కోసం మరో పేరు రేస్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ మెంటార్‌గా ఎంపికయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కేకేఆర్ మేనేజ్మెంట్ ఇప్పటికే వీరిద్దరి పేర్లు షార్ట్‌లిస్ట్ చేసిందట. వీళ్లలోనే ఒకరు కేకేఆర్ కొత్త మెంటార్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
పాంటింగ్ హింట్!
అయితే రికీ పాంటింగ్ 2025 ఐపీఎల్ గురించి ఓ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో హింట్ ఇచ్చాడు. వచ్చే సీజన్‌కు పలు ఫ్రాంచైజీల నుంచి అవకాశాలు వస్తున్నట్లు చెప్పాడు. 2025లో మళ్లీ తనను ఐపీఎల్లో చూసే ఛాన్స్ ఉందంటూ హింట్ ఇచ్చాడు. '2025 ఐపీఎల్ కోసం పలు ఫ్రాంచైజీల నుంచి నాకు ఆఫర్స్ వస్తున్నాయి. ఏం జరుగుతుందో కొన్ని వారాల్లోనే తెలిసిపోతుంది' అని పాంటింగ్ అన్నాడు.
🎙️RICKY PONTING: " there might be a few opportunities coming up in ipl and we'll see what happens over the next few weeks." 👀
— KKR Vibe (@KnightsVibe) September 11, 2024
📰 again kkr is interested in ricky ponting.( hindustan times).
is ricky ponting set to join kkr? pic.twitter.com/q1xWluRAtD
కాగా, పాంటింగ్‌ను దిల్లీ క్యాపిటల్స్ ఇటీవల వదులుకుంటున్నట్లు ప్రకటించింది. గతంలో 2018 నుంచి 2023 దాకా పాంటింగ్ దిల్లీకి మెంటార్‌గా వ్యవహరించాడు. ఇక అతడిని ఇటీవల దిల్లీ యాజమాన్యం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. అటు దిల్లీ కూడా పాంటింగ్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయనున్నారన్నది ప్రకటించలేదు. అయితే 2008 ప్రారంభ సీజన్లో పాంటింగ్ కేకేఆర్ జట్టుకే ఆడాడు. అతడు 4 మ్యాచ్‌ల్లో కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహించాడు.
ముంబయితో రోహిత్, SRHతో భువీ జర్నీ ఓవర్?- ఇక ఫ్రాంచైజీ మారడం పక్కా! - Rohit Sharma Mumbai Indians