Rahul Dravid Son Century : భారత మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ విజయ్ మర్చంట్ ట్రోఫీలో కర్ణాటక తరఫున తొలి సెంచరీ చేశాడు. శుక్రవారం ములపాడులోని డీవీఆర్ గ్రౌండ్‌లో ఝార్ఖండ్ అండర్-16తో జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే మ్యాచ్‌లో కర్ణాటక కీలక పాయింట్లు సాధించడంలో అన్వయ్ ఇన్నింగ్స్ కీ రోల్ పోషించింది.
జట్టులో వికెట్ కీపర్‌గా ఆడిన అన్వయ్ నెం.4లో బ్యాటింగ్‌కు వచ్చాడు. 153 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. 387 పరుగులు చేసిన ఝార్ఖండ్‌పై కర్ణాటక మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడంలో అన్వయ్ ప్రదర్శన కీలకంగా మారింది. మొదట కర్ణాటకను ఓపెనర్లు ఆర్యగౌడ, కెప్టెన్ ధృవ్ కృష్ణన్ బలమైన స్థితిలో నిలిపారు. వీరిద్దరూ సెంచరీలు చేసి 229 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇప్పటివరకు టోర్నీలో అన్వయ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ముందు ఆడిన రెండు ఇన్నింగ్స్‌లలో హాఫ్ సెంచరీ, 75 పరుగులు చేశాడు. గతేడాది కర్ణాటక అండర్-14 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అన్వయ్ క్రికెట్ జర్నీ అభిమానుల్లో జోష్ నింపుతోంది. 2020లో అన్వయ్ BTR షీల్డ్ అండర్-14 గ్రూప్ I సెమీ-ఫైనల్‌లో చెప్పుకోదగ్గ అర్ధశతకం సాధించడంతో వార్తల్లో నిలిచాడు. కేవలం 10 పరుగుల తేడాతో సెంచరీకి దూరమయ్యాడు.
- క్రికెట్‌లో రాణిస్తున్న ద్రవిడ్ వారసులు
అన్వయ్ అన్నయ్య సమిత్ ద్రవిడ్ కూడా ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో సమిత్ 8 మ్యాచుల్లో 362 పరుగులు చేసి, 16 వికెట్లు పడగొట్టాడు. కూచ్ బెహర్ ట్రోఫీని కర్ణాటక గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అతడు ఆగస్టులో జరిగిన మహారాజా ట్రోఫీ T20 టోర్నమెంట్‌లో మైసూరు వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సెప్టెంబరులో ఆస్ట్రేలియా U19తో జరిగిన సిరీస్ కోసం భారత్ అండర్-19 జట్టుకు భారతదేశ ఎంపికయ్యాడు. కానీ మోకాలి గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. దురదృష్టవశాత్తూ ఇటీవల 19 ఏళ్లు నిండటంతో, 2026 అండర్-19 ప్రపంచ కప్‌కు అర్హత పొందలేడు.
పాకిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ షాకింగ్ నిర్ణయం
ఇప్పుడు కూడా అదే ఆలోచనతో బరిలోకి దిగుతాం - మాకేం ఆందోళన లేదు! : గిల్