ETV Bharat / sports

'అదంతా ఫేక్- నేను అలా అనలేదు'- రోహిత్​పై వ్యాఖ్యలపై ప్రీతీ క్లారిటీ - IPL 2024 - IPL 2024

Preity Zinta On Rohit Sharma: స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గురించి తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని నటి ప్రీతీ జింతా చెప్పింది. మెగా వేలంలో రోహిత్ కోసం తాను ఎంత్తైనా ఖర్చు చేస్తానంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

Preity Zinta On Rohit Sharma
Preity Zinta On Rohit Sharma
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 9:33 AM IST

Updated : Apr 20, 2024, 10:51 AM IST

Preity Zinta On Rohit Sharma: ముంబయి ఇండియన్స్​ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఎంత్తైనా ఖర్చు చేస్తానని తాను చెప్పినట్లు వచ్చిన వార్తలను పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతీ జింతా ఖండించింది. అవన్నీ ఫేక్ వార్తలన్న (Fake)ప్రీతీ, తాను రోహిత్​పై అలాంటి కామెంట్స్ చేయలేదని పేర్కొంది. అవన్నీ ఉత్తి పుకార్లేనని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది.

'అవన్నీ ఫేక్ వార్తలు. రోహిత్ శర్మపై నాకు ఎంతో గౌరవం ఉంది. నేను అతడి ఫ్యాన్ కూడా. కానీ, నేను తన గురించి ఏ ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేదు. మా జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్​పై కూడా నాకు అపార గౌరవం ఉంది. ప్రస్తుతం ధావన్ గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. దయచేసి ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దు. ఇప్పుడు మా జట్టు చాలా బలంగా ఉంది. ప్రస్తుతం మా దృష్టి అంతా 2024 ఐపీఎల్​ టైటిల్ సాధించడంపైనే ఉంది' అని ప్రీతీ జింతా తన ఎక్స్​ (ట్విట్టర్​)లో అకౌంట్​లో పోస్ట్ షేర్ చేసింది.

అసంలేం జరిగిందంటే?
పంజాబ్ కింగ్స్ రీసెంట్​గా రాజస్థాన్​తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ప్రీతీ తమ జట్టుకు నిలకడగా రాణిస్తూ, ఛాంపియన్ మైండ్​సెట్​ ఉన్న ప్లేయర్ కావాలని ఆమె అభిప్రాయపడిందంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె 2025 మెగావేలంలోకి రోహిత్ శర్మ అందుబాటులో ఉంటే ఎంత భారీ మొత్తానికైనా కొనుగోలు చేసేందుకు సిద్ధం అన్నట్లు కథనాలు వచ్చాయి. ఈ మేరకు ప్రీతీ తాజాగా క్లారిటీ ఇచ్చింది.

Punjab kings IPL 2024: ప్రస్తుత సీజన్​లో పంజాబ్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ప్రతీ మ్యాచ్​లో పట్టుదలతో చివరి ఓవర్​ దాకా పోరాడుతున్నప్పటికీ పంజాబ్​కు నిరాశే ఎదురవుతోంది. ఆడిన ఏడు మ్యాచ్​ల్లో దాదాపు నాలుగు మ్యాచ్​ల్లో పంజాబ్ గెలుపు అంచులదాకా వచ్చి భంగపడింది. ఇక ఇప్పటివరకూ 7 మ్యాచ్​లు ఆడగా ఐదింట్లో ఓడి, రెండింట్లోనే విజయం సాధించింది. దీంతో 4 పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

థ్రిల్లింగ్ మ్యాచ్​లకు కేరాఫ్ అడ్రస్- ఎంటర్​టైన్​మెంట్​లో 'పంజాబ్' తగ్గేదేలే - IPL 2024

ధావన్ జెర్సీలో మార్పు- ఇకపై కొడుకు పేరుతోనే బరిలోకి? - IPL 2024

Last Updated : Apr 20, 2024, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.