ETV Bharat / sports

విరాట్, రోహిత్​ కాదు- 'జై షా'నే క్రికెట్​లో పవర్​ఫుల్! - పవర్​ఫుల్ ఇండియాన్స్ లిస్ట్ 2024

Powerful Indians In Cricket World: క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఎవరు పవర్​ఫుల్ అంటే అందరూ విరాట్ లేదా రోహిత్ పేరు చెప్తారు. కానీ, వీరిద్దరి కంటే బీసీసీఐ సెక్రటరీ జై షానే పవర్​ఫుల్ పర్సన్ అంట! అది ఎలాగంటే?

Powerful Indians In Cricket World
Powerful Indians In Cricket World
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 6:54 PM IST

Updated : Feb 29, 2024, 7:39 PM IST

Powerful Indians In Cricket World: బీసీసీఐ సెక్రటరీ జై షా '100 మోస్ట్ పవర్​ఫుల్ ఇండియన్స్​' 2024 లిస్ట్​లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంటే ముందున్నారు. ఓ జాతీయ మీడియా భారత్​లోని టాప్​- 100 పవర్​ఫుల్ వ్యక్తుల లిస్ట్​ రిలీజ్​ చేయగా అందులో జై షా 35వ స్థానంలో ఉన్నారు. ఇదే లిస్ట్​లో స్టార్ ప్లేయర్ విరాట్ 38వ ప్లేస్​లో ఉండగా, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 58వ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ 68వ స్థానం దక్కించుకున్నారు.

2023లో బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్​కు శ్రీకారం చుట్టడం, 2023 వన్డే వరల్డ్​కప్​ భారత్​లో సక్సెస్​ఫుల్​గా నిర్వహించడం, దాదాపు 128ఏళ్ల తర్వాత ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేర్చడంలో షా కృషి ఉంది. దీంతో జై షాను క్రికెట్ ప్రపంచంలో మోస్ట్ పవర్​ఫుల్​మేన్ లిస్ట్​లో​ చేర్చినట్లు సదరు మీడియా సంస్థ పేర్కొంది.

ఇక ఈ జాబితా ప్రకారం అథ్లెట్లలో విరాట్​దే టాప్ ప్లేస్​. టాప్- 100లో ధోనీ సహా విరాట్, రోహిత్, నీరజ్ చోప్రా, వినేశ్ ఫొగాట్​కు ఈ లిస్ట్​లో చోటు దక్కింది. వీరిలో విరాట్​ అందరికంటే ముందుండగా (38వ ప్లేస్​), ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా 46వ ర్యాంక్​ సాధించాడు. తర్వాత 42ఏళ్ల ధోనీ అంతర్జాతీయ క్రికెట్​ నుంచి తప్పుకున్నా మోస్ట్ ఇన్​ఫ్ల్యూయెన్సర్​గా ఉన్నాడు. దీంతో ధోనీ 58వ స్థానం దక్కించుకున్నాడు. ఇక రోహిత్ శర్మ 68 ప్లేస్​లో ఉండగా, 29ఏళ్ల రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 100వ స్థానంలో ఉన్నాడు.

BCCI Central Contract 2024: ఇక బీసీసీఐ తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రక్ట్​లో రోహిత్, విరాట్ A+ గ్రేడ్​ను రిటైన్ చేసుకున్నారు. ఈ గ్రేడ్​లో ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజాతోపాటు, పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తమ కాంట్రాక్ట్​ను పదిలంగా ఉంచుకున్నారు. ఈ గ్రేడ్​లో ఉన్న ప్లేయర్లకు సంవత్సరానికి రూ.7 కోట్ల మేర శాలరీ అందనుంది. వీరితోపాటు ఎ, బీ, సీ గ్రేడ్​లలో ఆయా ప్లేయర్లను చేర్చారు.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్​ - శ్రేయస్​, ఇషాన్​పై వేటు!

బుమ్రా ఈజ్ బ్యాక్- ఐదో టెస్టుకు భారత్ జట్టు ప్రకటన

Last Updated : Feb 29, 2024, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.