ETV Bharat / sports

కమిన్స్ నోట తెలుగు మాట - స్టార్ హీరోల డైలాగ్స్​ చెప్పి అదరగొడుతున్న స్టార్ క్రికెటర్ - IPL 2024 - IPL 2024

Pat Cummins SRH : సన్​రైజర్స్ హైదరాబాద్ సారథి ప్యాట్ కమిన్స్ తాజాగా తన ఫ్యాన్స్​కు ఓ స్వీట్ సర్​ప్రైజ్ ఇచ్చాడు. పాపులర్ తెలుగు హీరోల డైలాగ్స్ చెప్పి అదరగొట్టాడు. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

Pat Cummins SRH
Pat Cummins SRH
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 11:07 AM IST

Updated : Apr 24, 2024, 12:50 PM IST

Pat Cummins SRH : ప్రస్తుతం ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు సూపర్ ఫామ్​లో ఉంది. సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకెళ్తోంది. గ్రూప్-స్టేజ్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో విజయం సాధించిన ఈ జట్టు, ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు రికార్డు(ఆర్సీబీపై 287)ను కూడా ఇటీవలే సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఏకంగా మూడు సార్లు 250కి పైగా పరుగులు చేసింది.

మొదటి మూడు మ్యాచ్‌లలో రెండింట్లో ఓడిపోయిన సన్‌రైజర్స్‌ పేలవంగా టోర్నీ మొదలుపెట్టి అనంతరం వరుస విజయాలు అందుకుంది. సంచలనానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇటువంటి విజయాల వెనక ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కృషి ఎంతో ఉంది. ఓ ప్లేయర్​గానే కాకుండా ఓ కెప్టెన్​గానూ జట్టుకు ఎన్నో కీలక బాధ్యతలు అందించాడు ఈ స్టార్ క్రికెటర్. దీంతో ఇప్పుడు ఎటు చూసిన కమిన్స్ పేరు మారుమోగిపోతోంది.

తాజాగా ఈ స్టార్ క్రికెటర్ తెలుగు డైలాగ్స్​ చెప్పి నెటిజన్లను అబ్బురపరిచాడు. "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను", "కమ్మిన్స్ అంటే క్లాస్ అనుకున్నావా? మాస్ ఊరమాస్", "SRH అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ" అంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అంతే కాకుండా పవన్ కల్యాణ్ మేనరిజం చేసి అదరగొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.

మహేశ్​, కమిన్స్ ఓ ఫొటొషూట్
తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను కలిశారు. ఇద్దరూ కలిసి ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను కమ్మిన్స్‌ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో పోస్టు చేశాడు. 'లవ్లీ టూ మీట్‌ ద ప్రిన్స్‌ ఆఫ్‌ టాలీవుడ్‌! @urstrulymahesh' అనే క్యాప్షన్‌ యాడ్‌ చేశాడు. ఈ పోస్టును మహేష్‌ బాబు రీట్వీట్‌ చేశారు. 'ఎన్‌ యాబ్సల్యూట్‌ హానర్‌! ఎ బిగ్‌ ఫ్యాన్‌!' అంటూ రిప్లై ఇచ్చారు. ఇదే వేదికగా ఇతర సన్​రైజర్స్ ప్లేయర్స్​తోనూ మహేశ్ ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.

ట్రావిస్​ హెడ్​ కలర్ ఫాంటసీ- 'బ్లూ జెర్సీ కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నాడు' - IPL 2024

'దూకుడుతోనే సీజన్​ ఆరంభిస్తాం- ఇప్పట్నుంచి SRH ఆట చూస్తారుగా' - Pat Cummins IPL 2024 SRH

Last Updated : Apr 24, 2024, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.