ETV Bharat / sports

ఒలింపిక్స్​ టికెట్ సేల్స్ ఆల్​టైమ్​ రికార్డ్​​ - ఎన్ని అమ్ముడుపోయాయంటే? - Paris Olympics 2024 Record Tickets - PARIS OLYMPICS 2024 RECORD TICKETS

Paris Olympics 2024 Record Tickets : పారిస్ ఒలింపిక్స్ 2024​ టికెట్లు హాట్​ కేకుల్లా అమ్ముడుపోాతున్నాయి. ఇప్పటివరకు ఎన్ని అమ్ముడుపోయాయంటే?

source Associated Press
Paris Olympics 2024 Record Tickets (source Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 7:41 PM IST

Paris Olympics 2024 Record Tickets : మరికొన్ని గంటల్లోనే క్రీడల మహా సంగ్రామం పారిస్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే అతిరథ మహారథులు ఫ్రాన్స్ రాజధాని చేరుకున్నారు. అతిథులు, పర్యాటకుల రాకతో ఫ్రాన్స్ రాజధాని కిటకిటలాడుతోంది. అయితే పారిస్‌ ఒలింపిక్స్ 2024లో గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా టికెట్లు అమ్ముడైనట్టు ఒలింపిక్స్‌ నిర్వాహకులు ప్రకటించారు. చరిత్రలో అత్యధిక సంఖ్యలో టిక్కెట్లు విక్రయించిన ఒలింపిక్స్‌గా పారిస్‌ విశ్వ క్రీడలు రికార్డు సృష్టించాయని పేర్కొన్నారు. మిలియన్ల సంఖ్యలో టికెట్లు అమ్ముడు పోయినా ఇంకా టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు ఒలింపిక్స్‌ నిర్వహణ కమిటీ వెల్లడించింది.

రికార్డు స్థాయిలో - ఈ ఏడాది ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలకు 9.7 మిలియన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఒలింపిక్స్‌ నిర్వాహకులు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ కోసం మొత్తం 10 మిలియన్ టిక్కెట్లు అమ్మకానికి సిద్ధంగా ఉంచగా ఇప్పటికే అధిక శాతం టికెట్లను అభిమానులు కొనుగోలు చేశారని వెల్లడించారు. ఒలింపిక్స్‌లో ఇంతకుముందు ఏ ఒలింపిక్స్‌ గేమ్స్‌కు ఇంతటి ప్రజాదరణ దక్కలేదని అన్నారు. గత ఒలింపిక్స్‌ సమయంలో కరోనా మహమ్మారి కారణంగా జనాదరణ దక్కలేదని ఈసారి మాత్రం భారీగా టికెట్లు అమ్ముడయ్యాయని నిర్వాహకులు చెప్పారు.

టికెట్లు భారీగా అమ్ముడుపోయినా ఇంకా చాలా ఖాళీలు మిగిలి ఉన్నట్లు తేలడంతో మరిన్ని టికెట్లను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులు చూస్తున్నట్లు సమాచారం. మరోవైపు పారిస్‌లో నిజమైన సందడి ఇప్పుడే ఆరంభమైందని, అభిమానులు ఒక్కొక్కరు ఒలింపిక్ నగరానికి చేరుకుంటున్నారని తెలిసింది.

గతంలో ఇలా - 1996 అట్లాంట ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 8.3 మిలియన్ల టిక్కెట్లు విక్రయించారు.ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. ఏప్రిల్‌లో ప్రారంభమైన టికెట్ల విక్రయం ఇంకా కొనసాగుతూనే ఉంది. టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శల నేపథ్యంలో స్థానిక యువకులు, ఔత్సాహిక క్రీడాకారులు, వికలాంగులకు దాదాపుగా 10 లక్షల ఉచిత టికెట్లను అందించారు.

ప్రారంభ వేడుకలకు ఇలా - 2024 పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు చూసేందుకు 2,22,000 ఉచిత టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే చాలా టికెట్లను ఔత్సాహికులు సొంతం చేసుకున్నారు. లక్షకుపైగా టికెట్లను నామమాత్రపు రుసుముతో అమ్మకానికి పెట్టారు. ప్రారంభ వేడుకలు చూసేందుకు పారిస్‌ అంతటా 80 భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.ఈ వేదికలలో కెనడియన్ గాయని సెలిన్ డియోన్, అమెరికా పాప్‌స్టార్‌ లేడీ గాగా ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది. దువా లిపా, అరియానా కూడా ప్రదర్శన ఇస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలు లింగ సమానత్వం, స్థిరత్వం, సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా సాగనున్నాయి. పారిస్ 2024 స్లోగన్ "గేమ్స్ వైడ్ ఓపెన్" అనే నినాదాంతో పారిస్‌ నడిబొడ్డున ఈ వేడుకలు జరగనున్నాయి.

పారిస్ ఒలింపిక్స్​లో కాంట్రవర్సీ- ఆ అథ్లెట్ ఎంపికపై IOC ఫైర్ - Paris Olympics 2024

ఒలింపిక్స్​లో పాల్గొననున్న అతిచిన్న, పెద్ద ప్లేయర్లు ఎవరంటే? - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.