Paris 2024 Olympics 2024 Hockey Badminton : 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మంగళవారం భారత అథ్లెట్లు అదరగొట్టారు. బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ గ్రూప్ స్టేజ్‌లో భారత షట్లర్లు సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ జోడీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. మరోవైపు పూల్ B మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు ఐర్లాండ్‌ను ఓడించింది. క్వార్టర్‌ఫైనల్స్‌లో దాదాపుగా చోటు సంపాదించుకుంది.
- అద్భతంగా రాణించిన హర్మన్‌ప్రీత్ సింగ్
పురుషుల హాకీ పూల్ గేమ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రాణించడంతో భారత్ అద్భుత విజయం అందుకుంది. భారత పురుషుల హాకీ జట్టు 2-0 తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది.
హర్మన్‌ప్రీత్ సేన మ్యాచ్‌లో ఏరియల్స్‌ను అద్భుతంగా ఉపయోగించుకుంది. షార్ట్ పాసెస్‌పైనే ఎక్కువగా ఆధారపడింది. వేగంగా పాస్‌లు చేస్తూ, ప్రత్యర్థులను సులువుగానే ట్రాప్ చేశారు. ఐర్లాండ్ కొన్నిసార్లు ఎదురుదాడి చేసినా, కానీ ఏదీ గోల్ సాధించేంత ప్రమాదకరంగా లేవు. 11వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్ ద్వారా భారత్‌కు తొలి గోల్ వచ్చింది. అలానే మరొకటి 19వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ నుంచి వచ్చింది. భారత్ కెప్టెన్ రెండు గోల్స్ కొట్టి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో విజయం. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. తర్వాత అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయింది. పూల్‌లో మొదటి నాలుగు జట్లు క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. ఈరోజు విజయం భారత్‌కు క్వార్టర్‌ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు మెరుగుపరిచింది. గ్రూప్‌లోని బలమైన ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, బెల్జియంతో భారత్ ఇంకా ఆడలేదు. ఆగస్టు 1న బెల్జియంతో, ఆగస్టు 2న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
FT:
— Hockey India (@TheHockeyIndia) July 30, 2024
A good win today against Ireland.
2 smashing goals from Harmanpreet Singh one via a Stroke and one from Penalty Corner.
A nearly perfect game from Team India with no goals conceded in the game.
Strong performance from the defence and the wall Sreejesh.
This win… pic.twitter.com/KEh0akUzCI - చెలరేగిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి
పురుషుల డబుల్స్‌లో చివరి గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి విజయం సాధించారు. ఇండోనేషియాకు చెందిన మహ్మద్ రియాన్ అర్డియాంటో, ఫజర్ అల్ఫియాన్‌ను వరుస గేమ్‌లలో చిత్తు చేశారు. కేవలం 40 నిమిషాల్లో 21-13, 21-13 తేడాతో మ్యాచ్ కైవసం చేసుకున్నారు. ఈ గెలుపుతో క్వార్టర్-ఫైనల్‌కు అర్హత సాధించారు.
మొదటి సెట్‌లో ఇండోనేషియా బలమైన పోటీ ఇచ్చింది. మొదటి అర్ధ భాగంలో 11-8తో ముందంజ వేసింది. అప్పటి నుంచి సాత్విక్, చిరాగ్ జోరు పెంచారు. తర్వాత ఏ దశలోనూ ఇండోనేషియాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ విజయంతో భారత్ గ్రూప్ సిలో మూడింటిలో మూడు విజయాలు అందుకుంది. క్వార్టర్-ఫైనల్స్‌లో ప్రత్యర్థులు ఎవరో తెలియాలంటే డ్రాలు జరిగే వరకు వేచి ఉండాలి.🚨 Updates - Satwik and Chirag win their match convincingly in the Men’s Doubles Badminton event, while Bhajan Kaur moves into the R32 of the Archery Women’s Singles event. #JeetKiAur #Cheer4Bharat
— Team India (@WeAreTeamIndia) July 30, 2024
లైవ్ క్వార్టర్ ఫైనల్‌కు అడుగు దూరంలో భారత హాకీ టీమ్ - ఐర్లాండ్‌పై విజయం - PARIS OLYMPICS 2024