ETV Bharat / sports

'బాబర్ ఇంకా టాప్​లోనేనా- అసలు ఈ ర్యాంకింగ్స్​ ఎలా ఇస్తున్నారు?' - ICC Rankings

ICC Rankings ODI: ఐసీసీ ర్యాంకింగ్ సిస్టమ్​పై పాకిస్థాన్ మాజీ ప్లేయర్ బసిత్ అలీ విమర్శలు చేశాడు. ఈ ర్యాంకింగ్స్ ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నాడు.

ICC Rankings
ICC Rankings (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 16, 2024, 12:08 PM IST

ICC Rankings ODI: పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఐసీసీ రీసెంట్​గా రిలీజ్ చేసిన వన్డే ర్యాకింగ్స్​లో అగ్ర స్థానం నిలబెట్టుకున్నాడు. అయితే దాదాపు 8నెలల నుంచి ఈ ఫార్మాట్​లో బరిలో దిగని బాబర్ ఇంకా టాప్​లోనే ఉండడంపై పాక్‌ మాజీ ఆటగాడు బసిత్ అలీ విస్మయం వ్యక్తంచేశాడు. అతడు మ్యాచ్​లు ఆడకపోయినా ఐసీసీ ర్యాంక్ కేటాయిస్తున్నట్లు ఉందని అన్నాడు. ఈ ర్యాంకింగ్ సిస్టమ్ తనకు అర్థం కావట్లేదని పేర్కొన్నాడు.

'ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ చూశా. బాబర్ అజామ్‌ టాప్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా తర్వాత స్థానాల్లో నిలిచారు. ఇక ఇతర పొజిషన్లను చూడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. ఈ ర్యాంకులను చూస్తుంటే బాబర్‌ అజామ్‌ ఆడకపోయినా ఫర్వాలేదు అన్నట్లుగా ఐసీసీ తీరు ఉంది. వన్డేల్లో టాప్ ర్యాంకర్​గా ఉన్నందుకు బాబర్ సంతోషపడతాడు. అసలు ఇలాంటి ర్యాంకులను ఇచ్చిందెవరు? దేని ప్రకారం బాబర్‌ ఆజామ్‌, గిల్ ఈ ప్లేస్​ల్లో ఉన్నారు. గతేడాది వన్డే వరల్డ్​కప్​లో ఆడిన మ్యాచే బాబర్​కు ఆఖరిది. ఆ తర్వాత అతడు ఒక్కసారి కూడా బరిలోకి దిగలేదు. అయినప్పటికీ అతడి ర్యాంకు మాత్రం అలానే ఉంది. ఇక భారత యంగ్ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ శ్రీలంకపైనే ఆడాడు. అందులో గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. మరోవైపు గత వన్డే ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్ర, క్వింటన్ డికాక్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ తదితరుల ఆటను చూశాం. టోర్నీలో అద్భుతంగా ఆడి సెంచరీలు సాధించారు. పాక్‌ నుంచి కేవలం రిజ్వాన్, ఫఖర్ జమాన్ మాత్రమే శతకాలు చేశారు. అలాంటప్పుడు ర్యాంకుల విధానం సరిగ్గా లేదని అనిపిస్తోంది' అని బసిత్ పేర్కొన్నాడు.

కాగా, ఇటీవల ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్​లో బాబర్ 824 రేటింగ్స్​తో టాప్​లో కొనసాగుతున్నాడు. తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్​ శర్మ (765 రేటింగ్స్), శుభ్​మన్ గిల్ (763 రేటింగ్స్​), విరాట్ (746 రేటింగ్స్) వరుస స్థానాలు దక్కించుకున్నారు.

రోహిత్​ నెంబర్​ .2 - ఐసీసీ ర్యాంకింగ్స్​లో బెస్ట్ ర్యాంక్స్​ ఎవరు సాధించారంటే? - ICC LATEST RANKINGS

రోహిత్‌, కోహ్లీ, బుమ్రా - ఈ సీనియర్లు చివరిగా దేశవాళీ క్రికెట్‌ ఎప్పుడు ఆడారంటే? - Duleep Trophy 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.