Novak Djokovic Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా తాజాగా జరిగిన టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో సెర్బియా స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ విజయం సాధించాడు. వింబుల్డన్ ఛాంపియన్ కార్లెస్ అల్కరాజ్ పై 7-6 (7-3), 7-6 (7-2) తేడాతో ఫైనల్లో గెలుపొంది ఒలింపిక్స్‌లో తన మొదటి గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే ఒలింపిక్స్‌లో జొకోవిచ్, అల్కరాస్ ఇద్దరికీ ఇదే మొట్టమొదటి ఫైనల్ మ్యాచ్ కావడం విశేషం.
అయితే అల్కరాజ్ తొలి ఒలింపిక్స్ లోనే రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో నోవాక్ అత్యద్భుతంగా ఆడాడు. వీరిద్దరూ రెండు సెట్లలో ఒక్క సర్వ్ కూడా వదులుకోలేదు. దీంతో రెండు సెట్లు టై బ్రేకర్లుగా మారాయి. ఇక ట్రైబ్రేకర్‌లో అల్కరాజ్ ఓడిపోయాడు.
మరోవైపు ఈ గోల్డ్ మెడల్ సాధించడం వల్ల జకోవిచ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 'కెరీర్ గోల్డెన్ స్లామ్' ప్లేయర్ల లిస్ట్‌లో జకోవిచ్ చేరాడు. నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో పాటు ఒలింపిక్స్‌లో పసిడి పతకాలను గెలిచిన ప్లేయర్లను 'కెరీర్ గోల్డెన్ స్లామ్' ప్లేయర్లుగా పరిగణిస్తారు.
ఇక జకోవిచ్ కెరీర్ విషయానికి వస్తే, ఒలింపిక్‌లో గెలుచుకున్న ఈ గోల్డ్ మెడల్‌తో పాటు తన కెరీర్లో జకోవిచ్ మొత్తం 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌ను సాధించాడు. 1988లో జర్మనీకి చెందిన లెజండరీ ప్లేయర్ స్టెఫీ గ్రాఫ్ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో పాటు ఓ ఒలింపిక్ స్వర్ణాన్ని గెలిచి 'గోల్డెన్ స్లామ్ టైటిల్'ను సొంతం చేసుకున్న తొలి ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు.
ఆ తర్వాత 1999లో ఆండ్రీ అగస్సీ, 2010లో రాఫెల్ నాదల్, 2012లో సెరెనా విలియమ్స్ అన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌ను అలాగే ఓ ఒలింపిక్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. ఇక సింగిల్స్, డబుల్స్ రెండు కేటగిరీలలోనూ కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించిన ఏకైక మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా సెరెనా విలియమ్స్ చరిత్రకెక్కింది.
ఇదిలా ఉండగా, యంగ్ ప్లేయర్ కార్లోస్ అల్కరాస్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఒలింపిక్ స్వర్ణం తప్ప మినహా మిగతా అన్ని గ్రాండ్స్ స్లామ్ టైటిల్స్‌లోనూ విజయం సాధించాడు. ఉ
22ఏళ్ల స్విమ్మర్ ఖాతాలో 4 గోల్డ్ మెడల్స్- అందులో 2 సింగిల్ నైట్‌లో కొట్టినవే
సాత్విక్-చిరాగ్ ఓటమి - తాప్సీ భర్త షాకింగ్ డెసిషన్ - Paris Olympics 2024 Taapsee Husband