Neeraj Chopra Paris Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లోనూ దూసుకెళ్తున్నాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో తొలి ప్రయత్నంలోనే ఈటను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరాడు. ఈ క్రమంలో మీడియాతో నీరజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ కోసం తన అత్యుత్తమ ప్రదర్శనను కాపాడుకున్నానని నీరజ్ చోప్రా తెలిపాడు.
'ఇది కేవలం క్వాలిఫికేషన్ రౌండ్. ఫైనల్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మంచి ప్రారంభం లభించింది. 84 మీటర్ల ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్కుతో అర్హత సాధించిన త్రోయర్లందరూ ఫైనల్‌లో నాకు పోటీగా ఉంటారు. నా బెస్ట్ ఇంకా నేనివ్వలేదు. ఫైనల్ కోసం నా అత్యుత్తమ ప్రదర్శనను సేవ్ చేస్తున్నా. నేను ఫైనల్‌కు సిద్ధంగా ఉన్నాను. నేను పారిస్‌లో ప్రాక్టీస్‌లో బాగా రాణించలేకపోయాను'
'కానీ క్వాలిఫికేషన్ రౌండ్ ప్రారంభమైనప్పుడు మొదటి త్రోలో అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నా ఫిట్‌నెస్ ఇప్పుడు మెరుగ్గా ఉంది. నేను ఎప్పుడూ మొదటి త్రో నుంచి బాగా విసరడానికి ప్రయత్నిస్తాను. కానీ ప్రతిసారీ అలా జరగదు. మొదటి త్రోలో నేను విఫలమైతే, మిగిలిన త్రోలో నా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ ఏడాది ప్రారంభంలో తగిలిన గాయం బాధను అనుభవిస్తున్నా. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను' అని నీరజ్ క్వాలిఫికేషన్ రౌండ్ తర్వాత విలేకరులతో వ్యాఖ్యానించాడు.
🇮🇳🔥 𝗚𝗢𝗟𝗗 𝗡𝗢. 𝟮 𝗙𝗢𝗥 𝗡𝗘𝗘𝗥𝗔𝗝 𝗖𝗛𝗢𝗣𝗥𝗔? Neeraj Chopra advanced to the final of the men's javelin throw event thanks to a superb performance from him in the qualification round.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 6, 2024
💪 He threw a distance of 89.34m in his first attempt to book his place in the final.… pic.twitter.com/EAcJscqCFc
కాగా, 2022 జూన్‌లో స్వీడన్లో జరిగిన డైమండ్ లీగ్‌లో జావెలిన్‌ను 89.94 మీటర్ల దూరం విసిరాడు నీరజ్. ఇదే అతడి కెరీర్లో అత్యుత్తమ త్రో. ఆ తర్వాత పారిస్ లో మంగళవారం విసిరిన త్రోనే కెరీర్ సెకండ్ బెస్ట్. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించినప్పుడు 87.58 మీటర్ల దూరం ఈటను విసిరాడు నీరజ్. ఆ రికార్డును పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫై రౌండ్లోనే నీరజ్ సునాయాశంగా దాటేశాడు.
Paris Olympics Javelin Throw Final: ఇక ఆగస్టు 8న నీరజ్ ఫైనల్‌లో బరిలో దిగనున్నాడు. ఈసారి కూడా నీరజ్ పసిడి సాధిస్తాడన్న అంచనాలు భారీగా ఉన్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 3 పతకాలు సాధించినప్పటికీ, పసిడి ఖాతా తెరవలేదు. దీంతో నీరజ్ పసిడిని సాధిస్తాడని యావత్ భారతీయులు ఆశిస్తున్నారు.
नीरज चोपड़ा ने 89.34 मीटर फेंककर इतिहास रचा और जेवलिन थ्रो के फाइनल के लिए क्वालीफाई किया! ❣️🇮🇳🔥
— Aditya Ranjan 🇮🇳 (@adityaranjan108) August 6, 2024
पेरिस ओलंपिक में कल मिल सकता है भारत को पहला #Gold मेडल.. #NeerajChopra pic.twitter.com/RNtbbUa3AH
ఫైనల్‌కు నీరజ్- మరో గోల్డ్ మెడల్ లోడింగ్!
నీరజ్ గోల్డ్ మెడల్ కొడితే 'ఫ్రీ వీసా'- ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు! - Paris Olympics 2024