MI vs SRH IPL 2024 : ఐపీఎల్-17లో భాగంగా ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడి ఎనిమిదిటిలో ఓటమితో దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది ముంబయి ఇండియన్స్. అయితే ఇప్పుడా జట్టు వేరే జట్ల ఛాన్స్‌లను దెబ్బ తీసే పనిలో పడినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో ముందుగా ఆ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ ఇచ్చింది.
తాజాగా వాంఖడే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో 174 పరుగుల లక్ష్యాన్ని 16 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది ముంబయి. ఈ లక్ష్య ఛేదనలో ముంబయి ఆరంభంలోనే పరుగులు చేసినా తడబడింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (9 పరుగులు), రోహిత్ శర్మ (4 పరుగులు) క్రీజులో కుదురుకోలేకపోయారు. రెండు ఫోర్లు కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన ఇషాన్, జాన్సన్ బౌలింగ్‌లో క్యాచౌట్ అయ్యాడు. ఇక కమిన్స్ వేసిన బంతిని రోహిత్ డిఫెన్స్ ఆడబోగా అది అమాంతం గాల్లోకి లేచింది. వెంటనే వికెట్ కీపర్ క్లాసెన్ బంతిని అందుకున్నాడు.
దీంతో రోహిత్ కూడా స్పల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన నమన్ ధీర్ (0) కూడా క్రీజులో ఇబ్బందిగా కనిపించాడు. అతడు పరుగుల ఖాతా తెరవకుండానే భువనేశ్వర్ బౌలింగ్‌లో క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో పవర్ ప్లేలోనే ముంబయి మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం సూర్యకుమార్ (51 బంతుల్లో 12×4, 6×4 సాయంతో 102 నాటౌట్) తన ప్రతాపం చూపించి జట్టుకు విజయాన్ని అందించాడు. తిలక్ వర్మ (32 బంతుల్లో 6×4 సాయంతో 37 నాటౌట్) రాణించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ (1/22) మెరిశాడు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ప్రత్యర్థి ముంబయి ముంగిట 174 పరుగుల టార్గెట్ నిలిపింది. ట్రావిస్ హెడ్ (48 పరుగులు), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (35* పరుగులు) రాణించారు. అభిషేక్ శర్మ (11), మయంక్ అగర్వాల్ (5), నితీశ్ రెడ్డి (20), హెన్రీచ్ క్లాసెన్ (2), మార్కొ జాన్సన్ (17), షహబాజ్ అహ్మద్ (10) పెద్దగా ఆకట్టుకోలేదు. ముంబయి బౌలర్లలో పీయుష్ చావ్లా, హార్దిక్ పాండ్య చెరో 3, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ దక్కించుకున్నారు.
టీమ్ఇండియా వరల్డ్‌కప్ జెర్సీ రిలీజ్- కొత్త డిజైన్ చూశారా? - T20 World Cup 2024