ETV Bharat / sports

ముంబయిపై కోల్​కతా విజయం - 12ఏళ్ల తర్వాత తొలిసారి! - IPL 2024 - IPL 2024

MI vs KKR IPL 2024: వాంఖడే వేదికగా తాజాగా జరిగిన మ్యాచ్​లో ముంబయి ఓటమిని అందుకుంది. హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీలో సీజన్‌ ఆరంభం నుంచి తడబడుతూ ఆడుతున్న ఆ జట్టు 11వ మ్యాచ్​లోనూ విఫలమై ఎనిమిదో ఓటమిని ఖాతాలో వేసుకుంది.

Source: ANI
MI vs KKR IPL 2024 (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 10:55 PM IST

Updated : May 4, 2024, 6:17 AM IST

MI vs KKR IPL 2024: ఐపీఎల్‌ 2024లో ఇక ముంబయి ఇండియన్స్‌కు ఫలితాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు! ప్లేఆఫ్స్‌ సమీకరణాల గురించి కసరత్తులు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ సీజన్​లో ముంబయి కథ ముగిసింది! పేలవ ప్రదర్శనతో తాజాగా ఎనిమిదో ఓటమిని ఖాతాలో వేసుకుంది. దీంతో ముంబయికి ప్లేఆఫ్స్‌కు దారులు మూసుకుపోయాయి. ఈ మ్యాచ్​లో విజయం సాధించిన కోల్​కతా 12ఏళ్ల తర్వాత తొలిసారి ముంబయిలో ఎమ్​ఐపై గెలవడం విశేషం.

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి మ్యాచ్‌ను గొప్పగా ఆరంభించినా, ఆ తర్వాత పట్టు కోల్పోయి కోల్‌కతాకు మ్యాచ్‌ను సమర్పించుకుంది. 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (56; 35 బంతుల్లో 6×4, 2×6) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగితా వారు విఫలమయ్యారు. స్టార్క్‌ (4/33)కు తోడు వరుణ్‌ చక్రవర్తి (2/22), నరైన్‌ (2/22), రసెల్‌ (2/30) విజృంభించడం వల్ల ముంబయి బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్​కతా 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. వెంకటేశ్ అయ్యర్ (70 పరుగులు) భారీ ఇన్నింగ్స్​తో ఆకట్టుకోగా, మనీశ్ పాండే (42 పరుగులు) రాణించారు. ఈ ఇద్దరు మినహా కేకేఆర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఓపెనర్లు పిల్ సాల్ట్ (5), సునీల్ నరైన్ (8), రఘువంశీ (13), శ్రేయస్ అయ్యర్ (6), రింకూ సింగ్ (9), అండ్రూ రస్సెల్ (7) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా చెరో 3, హార్దిక్ పాండ్య 2, పీయుశ్ చావ్లా 1 వికెట్ దక్కించుకున్నారు.

హిట్​మ్యాన్ ఇంపాక్ట్: ఈ మ్యాచ్​లో ముంబయి స్టార్క్​ ఇంపాక్ట్ ప్లేయర్​గా క్రీజులోకి వచ్చాడు. ఫీల్డింగ్ సమయంలో డగౌట్​కే పరిమితమైన రోహిత్, ఛేజింగ్​లో ఓపెనింగ్ బ్యాటర్​గా వచ్చాడు. అయితే వర్క్​లోడ్ కారణంగానే రోహిత్ తుది జట్టులో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్​లో రోహిత్ 12 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ మ్యాచ్​లో ముంబయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ముంబయి సొంత మైదానం వాంఖడేలో 50 ఐపీఎల్​ వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు.

వరల్డ్​కప్ ప్లేయర్ల పెర్ఫార్మెన్స్- బెర్త్ ఫిక్స్ అయ్యాక ఇలాగైతే ఎలా? - T20 World Cup 2024

వన్డే, T20లో 'భారత్​'దే అగ్రస్థానం- టెస్టుల్లో ఆసీస్ టాప్​లోకి - ICC Team Ranking 2024

Last Updated : May 4, 2024, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.