ETV Bharat / sports

షూటింగ్‌కు మను బాకర్​ విరామం! - నెక్ట్స్​ ఏం చేయబోతుందంటే? - Manu Bhaker Break from Shooting - MANU BHAKER BREAK FROM SHOOTING

Manu Bhaker Take Break From Shooting : ఇంతకాలం పిస్టల్‌ చప్పుళ్లతో గ్యాప్​ లేకుండా గడిపిన భారత స్టార్​ షూటర్‌ మను బాకర్‌ ప్రస్తుతం కొన్ని నెలల పాటు గన్‌ శబ్దాలకు కాస్త దూరంగా ఉండాలని అనుకుంటోందట. పూర్తి వివరాలు స్టోరీలో.

source Associated Press
Manu Bhaker (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 16, 2024, 9:20 PM IST

Updated : Aug 16, 2024, 9:29 PM IST

Manu Bhaker Take Break From Shooting : ఇటీవలే ముగిసిన పారిస్​ ఒలింపిక్స్​ 2024లో రెండు కాంస్య పతకాలతో ప్రపంచ క్రీడా వేదికపై మను బాకర్​ సత్తాచాటిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి ఈ ఒలింపిక్స్‌ కోసం ఎన్నో అభిరుచులను పక్కన పెట్టింది మను బాకర్‌. చిన్నతనంలోనే కరాటేలో ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ షూటింగ్‌వైపు మనసు మార్చుకుంది. ఫైనల్​గా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.

అయితే ఇంత కాలం పిస్టల్‌ చప్పుళ్లతో ఖాళీ లేకుండా గడిపిన మను బాకర్​ కొన్ని నెలల పాటు ఈ గన్​ శబ్దాలకు కాస్త దూరంగా ఉండాలని అనుకుంటోందట. మూడు నెలల పాటు షూటింగ్ నుంచి విరామం తీసుకొని స్కేటింగ్‌, గుర్రపు స్వారీ, భరతనాట్యం వంటి వాటిపై దృష్టి పెట్టబోతున్నట్లు తెలిపింది. కోచ్‌ జస్పాల్‌ రానాతో కలిసి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది. ఇంకా పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.

"ఇప్పుడు నాకు కాస్త సమయం దొరికింది. కరాటే ట్రైనింగ్​ మళ్లీ చేయగలను అని అనుకుంటున్నాను. అంతకుముందు దాని కోసం సమయం కేటాయించలేకపోయాను. ఇప్పుడు నా వ్యక్తిగత ఇష్టాల కోసం కాస్త బ్రేక్​ దొరికింది. స్కేటింగ్‌, గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టం. రోడ్లపైనా కూడా చేయగలను. డ్యాన్స్‌ కూడా చాలా ఇష్టం. అందుకే భరత నాట్యం నేర్చుకుంటున్నాను. వయోలిన్‌ కూడా వచ్చు" అని మను బాకర్‌ వెల్లడించింది.

కాగా, పారిస్ ఒలింపిక్స్​లో మను బాకర్‌ 10 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్​లో రెండు బ్రాంజ్​ మెడల్స్​ను సొంతం చేసుకుంది. 124 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో మెడల్స్​ను దక్కించుకుంది. ఈ మెడల్స్ సాధించడంతో మన బాకర్​కు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రూ.30 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఇకపోతే ఆమె సిల్వర్​ మెడల్ విన్నర్​ నీరజ్​ చోప్రాతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగింది. కానీ ఆ వార్తలను ఆమె ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

గంగ్నమ్ స్టైల్​, భంగమ్‌ స్టైల్​ - ఈ ప్లేయర్లు వికెట్‌ తీస్తే ఇక స్టేప్పులే - Bowler Wicket Celebration Style

పారిస్​ మరోసారి ముస్తాబు - పారాఒలింపిక్స్ పతాకధారులుగా​ భాగ్యశ్రీ జాధవ్, సుమిత్ అంతిల్ - Paralympics 2024

Last Updated : Aug 16, 2024, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.