ETV Bharat / sports

'ఆ క్రికెటర్లు అంటే నాకు చాలా ఇష్టం - ఆయన మాత్రం ఇన్​స్పిరేషన్' - Manu Bhaker Favourite Cricketer

Manu Bhaker Favourite Cricketer : పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత షూటర్ మను బాకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరట్ క్రికెటర్ల పేర్లు రివీల్ చేసింది. అంతే కాకుండా తనకు ఇన్​స్పిరేషన్​గా నిలిచిన ఓ స్టార్ అథ్లెట్​ గురించి చెప్పుకొచ్చింది. ఇంతకీ వారెవరంటే?

Manu Bhaker Favourite Cricketer
Manu Bhaker (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 25, 2024, 11:16 AM IST

Updated : Aug 25, 2024, 11:29 AM IST

Manu Bhaker Favourite Cricketer : పారిస్ ఒలింపిక్స్​లో రెండు కాంస్య పతకాలు సాధించి క్రీడాభిమానుల్లో సూపర్ క్రేజ్ సంపదించికుంది స్టార్ షూటర్ మనుబాకర్​. తన అత్యద్భుతమైన పెర్ఫామెన్స్​తో అందరినీ అబ్బురపరిచి ట్రెండ్​లో నిలిచింది. ఇక అభిమానులు కూడా ఈమె ఇష్టాఇష్టాలను తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరట్ క్రికెటర్ల పేర్లు రివీల్ చేసింది. అంతే కాకుండా తనకు ఇన్​స్పిరేషన్​గా నిలిచిన ఓ స్టార్ అథ్లెట్​ గురించి చెప్పుకొచ్చింది. ఇంతకీ వారెవరంటే?

"నాకు చాలామంది ప్లేయర్లంటే ఇష్టం కానీ అందులో కొంతమంది పేర్లను మాత్రమే ఇప్పుడు రివీల్ చేస్తాను. టీమ్ఇండియాలో ముగ్గురు క్రికెటర్లు నా ఫేవరెట్. వారే సచిన్ తెందూల్కర్, మహేంద్ర సింగ్​ ధోనీ, విరాట్ కోహ్లీ. ఈ ముగ్గురితో ఒక్క గంట సమయమైనా వెచ్చించినా ఎంతో గౌరవంగా అనిపిస్తుంది. వారితో కాసేపు మాట్లాడినా కూడా ఎంతో ఇన్​స్పిరేషన్​గా నిలుస్తుంది. ఇక జమైకా స్టార్‌ రన్నర్ ఉసేన్ బోల్ట్ నా ఇన్​స్పిరేషన్. ఆయన బయోపిక్​ కూడా చదివాను. బోల్ట్ ప్రయాణం నాకెప్పుడూ ఇన్​స్పిరేషన్​గా నిలుస్తుంది. బుక్సే కాదు ఆయనకు సంబంధించిన చాలా ఇంటర్వ్యూలు చూశాను. " అని మను బాకర్ పేర్కొంది.

ఆ టాటూ వల్లే నేను ఇలా ఉన్నాను
టోక్యో ఒలింపిక్స్​ నాకు చాలా పాఠాలు నేర్పింది. ఆ వైఫల్యాన్ని దాటుకుని నేను ముందుకు సాగాలని అనుకున్నప్పటికీ రోజు రోజుకూ అది మరింత కఠినంగా మారింది. ఆ సమయంలోనే నేను ఓ టాటూ వేసుకోవాలని అనుకున్నా. అదే నన్ను ముందుకు నడిపిస్తుందని అనుకున్నాను. (Still I Rise) 'నేను మళ్లీ పైకి లేస్తా' అని దానికి అర్థం. అది నాకెంతో నచ్చిన టాటూ. అది నాలో ఎంతో ఇన్​స్పిరేషన్​ నింపింది.

చెన్నైలో మను సందడి
Shooter Manu Bhaker In Chennai : ఇటీవలే మను బాకర్‌ను చెన్నైలో ఘనంగా సన్మానించారు. నోలంబూర్‌లోని ఒక ప్రైవేట్ విద్యాసంస్థకు వెళ్లిన ఆమెకు అక్కడి విద్యార్థుల తరఫున రూ.2.07 కోట్ల ప్రోత్సాహకాన్ని అందజేసింది యాజమాన్యం. ఆ తర్వాత విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మను బాకర్ సమాధానాలు చెప్పింది. వారితో కలిసి పాటలు పాడుతూ సరదాగా గడిపింది.

మను బాకర్​తో నీరజ్​ చోప్రా పెళ్లి - స్పష్టత ఇచ్చిన షూటర్​ తండ్రి - Manu bhaker Neeraj chopra Marriage

షూటింగ్‌కు మను బాకర్​ విరామం! - నెక్ట్స్​ ఏం చేయబోతుందంటే? - Manu Bhaker Break from Shooting

Last Updated : Aug 25, 2024, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.