ETV Bharat / sports

ఫ్లైయింగ్ కిస్ సెలబ్రేషన్​పై రానా క్లారిటీ- విరాట్​తోనూ అలా చేయమని ఛాలెంజ్​! - Harshit Rana Flying Kiss - HARSHIT RANA FLYING KISS

Harshit Rana Flying Kiss: ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా బౌలర్‌ హర్షిత్‌ రానా, ఫ్లైయింగ్‌ కిస్‌ కాంట్రవర్సీకి దారి తీసింది. ఆ ఘటన తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయని రానా చెప్పాడు. ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గన్న రానా, ఈ ఘటనపై ఆసక్తికర విషయాలు చెప్పాడు.

Harshit Rana Flying Kiss
Harshit Rana Flying Kiss (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 17, 2024, 9:58 PM IST

Harshit Rana Flying Kiss: కోల్​కతా నైట్​రైడర్స్ బౌలర్ హర్షిత్‌ రానా 2024 ఐపీఎల్​లో తన పెర్ఫార్మెన్స్​ కంటే ఫ్లైయింగ్‌ కిస్​తోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. లీగ్‌లో 19 వికెట్లు తీసిన దానికంటే, సన్​రైజర్స్​తో మ్యాచ్​లో అతడి ఫ్లైయింగ్‌ కిస్‌ సెలబ్రేషనే ఎక్కువ మందికి గుర్తుంది. ఆ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన రానా, వికెట్‌ సెలబ్రేట్‌ చేసుకుంటూ ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులు అతడిపై చర్యలు తీసుకున్నారు. మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించారు. అయితే ఈ ఘటన గురించి తాజాగా హర్షిత్‌ రానా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. ఆ ఇన్సిడెంట్‌ తర్వాత ఎదురైన అంశాలు, తనలో వచ్చిన మార్పుల గురించి వివరించాడు.

'ఆ రోజు నేను ఉద్దేశపూర్వకంగా ఫ్లైయింగ్‌ కిస్‌ ఇవ్వలేదు. మయాంక్ భయ్యా వికెట్ తీసినప్పుడు, బాల్‌ వేసిన వేగాన్ని నియంత్రించుకునే క్రమంలో సాధారణంగానే అతనికి దగ్గరిగా వెళ్లాను. వికెట్‌ తీసిన ఆనందంలో సహజంగానే ఫ్లైయింగ్‌ కిస్‌ ఇచ్చాను. మయాంక్‌కి నాకు మధ్య అంతకు ముందు కొన్ని ఘటనలు జరిగాయి. దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో కూడా కొంచెం సరదాగా ఒకరినొకరు మాటలు అనుకున్నాం. ఫ్లైయింగ్‌ కిస్‌ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ప్రేక్షకులు నా దగ్గరకు వచ్చినప్పుడు, దాని గురించే అడుగుతున్నారు. అలానైనా నేను అందరికీ గుర్తున్నానని ఆనందంగా ఉండేది' అని అన్నాడు.

ఈ విషయంలో టీమ్ ఓనర్ షారూక్​ ఖాన్, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి కూడా తనకు మద్దతు లభించిందని రానా పేర్కొన్నాడు. 'నువ్వు ఎంజాయ్‌ చేస్తుంటే, ఆ పని చేస్తూనే ఉండు. అందులో తప్పు లేదు' అని రోహిత్ చెప్పినట్లు తెలిపాడు. 'రోహిత్ భయ్యాకు బ్యాటింగ్‌లో గ్రేట్ టైమింగ్‌ ఉంది. ప్రపంచంలో ఏ బౌలర్ కూడా అతడిని పేస్‌తో ఓడించలేడు. అందుకే ఫాస్ట్ బౌలర్లు ఎల్లప్పుడూ అతడి ముందు ఓ అడుగు వెనకే ఉంటారు' అని చెప్పాడు.

విరాట్‌తో కూడా అలా చేయమన్నారు
ఇలాగే విరాట్ కోహ్లీకి కూడా ఫ్లైయింగ్‌ కిస్‌ ఇవ్వమని తనకు చాలా మంది ఛాలెంజ్‌ విసిరారని రానా చెప్పాడు. 'విరాట్‌ని నేను టీజ్‌ చేయను. అతనంటే నాకు గౌరవం ఉంది. నాకు ప్రతి ఆటగాడి పట్ల గౌరవం ఉంటుంది. ఫీల్డ్‌లో విరాట్ భయ్యా క్రియేట్ చేసే ఎనర్జీ, అతడు ఎల్లప్పుడూ ఫీల్డ్‌లో ఉండే తీరు, ఇంకెవరికీ సాధ్యం కాదు. నేను అతడి అభిమానిని. అతడిలా ఉండాలనుకుంటున్నాను' అని చెప్పాడు. ఆర్సీబీ ఇంకా ఎందుకు ట్రోఫీని గెలవలేదు? అనే ప్రశ్నకు స్పందిస్తూ, 'సర్, ఉంకీ కిస్మత్ ఖరాబ్ హై (వాళ్లకి ఆ అదృష్టం లేదు)' అన్నాడు.

సూపర్-8కు చేరుకున్న జట్లు ఇవే- టీమ్ఇండియా ఎవరితో తలపడనుందటే? - T20 world cup 2024

హెడ్​ కోచ్​గా గంభీర్ ఫిక్స్​? ఆ కండీషన్​కు ఓకే చెప్తేనే! - Team India New Coach

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.