KKR IPL 2024: 2024 ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మూడో టైటిల్ ముద్దాడింది. లీగ్ స్టేజ్ నుంచే అత్యుత్తమ ఆట తీరుతో అందర్నీ ఆకట్టుకున్న కేకేఆర్, ఫైనల్లోనూ అదే ప్రదర్శన కనబర్చి ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో దాదాపు 10ఏళ్ల తర్వాత ట్రోఫీ నెగ్గడం వల్ల కేకేఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఈ క్రమంలో కేకేఆర్ ప్లేయర్లపై పలువురు మాజీ ప్లేయర్లు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఎవరెవరు ఏమన్నారంటే?
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కూడా కేకేఆర్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. 'ఈ సీజన్లో కేకేఆర్ పెర్ఫార్మెన్స్ అద్భుతం. టోర్నీలో ఫస్ట్‌హాఫ్‌లో బ్యాటర్లు రాణిస్తే, చివర్లో బౌలర్లు ఆకట్టుకున్నారు. మూడోసారి టైటిల్ నెగ్గిన కేకేఆర్ ప్లేయర్లు, స్టాఫ్ అందరికీ శుభాకాంక్షలు. రెండు నెలలుగా ఐపీఎల్‌లో వెలుగులు నింపుతూ తుదిపోరులో ఓడిన సన్‌రైజర్స్ కూడా నా అభినందనలు' అని సచిన్ తెందూల్కర్ ట్వీట్ చేశాడు. 'మూడో ట్రోఫీ నెగ్గిన కేకేఆర్‌కు శుభాకాంక్షలు. ఫీల్డ్‌లో జట్టును నడిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు అభినందనలు. ఇక ఆశీశ్ నెహ్రాలాగే, గౌతమ్ గంభీర్ కూడా మెంటార్‌గా సక్సెస్ అయ్యారు. వాళ్ల జట్లను ఛాంపియన్లుగా నిలిపారు' అని సెహ్వాగ్ పేర్కొన్నారు
కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఆమె ట్విట్టర్ వేదికగా కేకేఆర్ ప్లేయర్లకు శుభాకాంక్షలు చెప్పారు. 'బంగాల్ రాష్ట్రమంతా కేకేఆర్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ సీజన్లో అత్యుత్తమంగా రాణించిన ప్లేయర్లకు, స్టాఫ్, జట్టు యాజమాన్యానికి నా శుభాకాంక్షలు. రానున్న సీజన్లలోనూ ఇలాగే ఆడుతూ మరిన్ని విజయాలు నమోదు చేయాలని కోరుకుంటున్నా' అని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
'కేకేఆర్ 3వ టైటిల్ నెగ్గింది. ఈ సీజన్ వారికి అద్భుతమైనది. శ్రేయస్ కెప్టెన్సీ, బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. జట్టులోకి గౌతమ్ గంభీర్ పాత్ర కీలకంగా మారింది. షారుక్‌కు శుభాకాంక్షలు. ఇక సూపర్ పెర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్ చేసిన సన్‌రైజర్స్‌కు అభినందనలు' అని మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ ట్వీట్ చేసింది.
కప్పు 'కోల్‌కతా'దే- ఫైనల్లో సన్‌రైజర్స్ ఓటమి - SRH Lost In IPL 2024 Final
IPL ప్రైజ్‌మనీ- 'కోల్‌కతా'కు రూ.20 కోట్లు- మరి ఎవరెవరికి ఎంతంటే? - IPL 2024