Jos Buttler Rajasthan Royals : ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగుతున్నాయి. రోజుకో కొత్త రికార్డును క్రియేట్ చేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. అటు ప్లేయర్స్‌తో పాటు ఇటు ఫ్రాంచైజీలు కూడా తమ ప్లేయర్ల పెర్ఫామెన్స్‌ను చూసి సంతోషిస్తున్నారు. ఇటీవలే జైపుర్ వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు అరుదైన రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నాయి. విరాట్ ఒక్కడే భారాన్ని భుజం మీద వేసుకుని జట్టును నెట్టుకొచ్చినప్పటికీ విజయం రాజస్థాన్ జట్టును వరించింది.
అయితే ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ (113*) వీరోచితంగా పోరాడి శతకాలు బాదారు. ఓ వైపు విరాట్ తన సెంచరీతో జట్టుకు మెరుగైన స్కోర్ అందించగా, మరోవైపు ఓపెనర్‌గా క్రీజులోకి దిగిన జోస్ బట్లర్ (100*) తన శతకంతోనే జట్టును గెలిపించాడు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు జోష్‌పై పడింది.
గత సీజన్‌లో పేలవ ఫామ్‌లో టీమ్‌ను నిరాశపరిచాడు ఈ ఫారిన్ ప్లేయర్. మొత్తం 10 మ్యాచ్‌లు ఆడగా, అందులో జోస్ 183 పరుగులు మాత్రమే స్కోర్ చేయగలిగాడు. అందులోనూ మూడు డక్‌లూ ఉన్నాయి. ఇక ఈ సీజన్ తొలి మ్యాచుల్లోనూ పెద్దగా రాణించలేదు. అయితే శుక్రవారం (ఏప్రిల్ 6న) జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టి అందరినీ అబ్బురపరిచాడు. సూపర్ జాస్ ఈజ్ బ్యాక్ అనేలా చేశాడు. అంతే కాకుండా తన అత్యుత్తమ పెర్ఫామెన్స్‌కు గానూ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' కూడా అందుకున్నాడు. ఇక అవార్డు తీసుకున్న తర్వాత జోస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"ఈ మ్యాచ్‌లో నాకు కాస్త అదృష్టం కలిసొచ్చింది అనే చెప్పాలి. చివరి వరకూ నేను క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను ముగించడం నాకు చాలా నచ్చింది. మ్యాచ్‌లు ఆడినంత కాలం ఒత్తిడి, ఆందోళన అనేవి ప్లేయర్‌కు తప్పదు. మన మనస్సు చాలా శక్తిమంతం. దాన్ని కంట్రోల్లో ఉంచుకుని తీవ్రంగా శ్రమించాలి. అదే సమయంలో మనకు కాస్త లక్ కూడా కావాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఓటమిని చవి చూడాల్సి ఉంటుంది. అప్పుడు మనకి మనం సర్దిచెప్పుకోగలగాలి. గత మ్యాచ్‌లోనూ నేను బాగానే ఆడినప్పటికీ త్వరగానే (13పరుగులకే) ఈ లీగ్‌కు ముందు సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లోనూ బాగానే ఆడాను. ఇప్పుడు ఒక్కసారి మంచి ఇన్నింగ్స్ ఆడితే చాలు, ఇక లైన్‌లోకి రావచ్చని అనుకున్నాను. మేము ఈ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించాం. ఇలాగే కొనసాగించాల్సిన అవసరం కూడా మాకు ఎంతో ఉంది. దాని కోసం మా టీమ్ మొత్తం తీవ్రంగా శ్రమిస్తాం" అని జోస్ బట్లర్ తెలిపాడు.
ఉప్పల్ స్టేడియంలో రూ. 4,500 సీట్ మిస్ - రీఫండ్ డిమాండ్ చేసిన చెన్నై అభిమాని! - CSK VS SRH Match Fan