Joe Root Bowling vs India: ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బ్యాట్‌తో కంటే బంతితో రాణిస్తున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో ఇప్పటివరకు రూట్ 89 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో 3.25 ఎకనమీతో 7 కీలక వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో బ్యాట్‌తో అంతగా రాణించలేకపోతున్న రూట్‌ను కామెంటేటర్ రవిశాస్త్రి ఫన్నీగా ట్రోల్ చేశాడు.
'జోరూట్ ఈ సిరీస్‌లో 89 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంటే ఈ సిరీస్‌లో అతడు బాదిన పరుగుల కంటే ఈ సంఖ్య ఎక్కువ' అని మ్యాచ్ జరుగుతుండగా అన్నాడు. దీంతో అతడి కో- కామెంటేటర్స్తోపాటు ఆడియెన్స్కూడా నవ్వుకున్నారు. అయితే ఈ సిరీస్‌లో రూట్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 70 పరుగులు మాత్రమే చేశాడు. అతడి సగటు 14గా ఉంది. ఒక్కసారి కూడా రూట్ 30 పరుగుల మార్క్ టచ్ చేయలేదు. అయితే టెస్టుల్లో ఓ గడ్డపై అయినా అద్భుతంగా రాణించే రూట్ భారత్‌తో సిరీస్‌లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు.
ఇక ప్రస్తుత మ్యాచ్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ దక్కించుకున్న రూట్, రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన రోహిత్ శర్మను ఔట్ చేశాడు. ఇక ప్రస్తుత సిరీస్‌లో రూట్ అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేసిన మూడో ఇంగ్లాండ్ ప్లేయర్‌గా నిలిచాడు. టామ్ హార్ట్లీ, రెహాన్ అహ్మద్ ఈ లిస్ట్‌లో అతడి కంటే ముందున్నారు.
అలా ఆడడం ఎందుకు? అయితే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో రూట్ 18 పరుగులకే పెవిలియన్ చేరాడు. బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ ర్యాంప్ షాట్ ఆడే క్రమంలో సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న యశస్వి జైస్వాల్‌కు దొరికిపోయాడు. అయితే బజ్‌బాల్ క్రికెట్ ఆడే క్రమంలో రూట్ ఇలా ఔటవ్వడం రెండోసారి. దీంతో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ దీనిపై స్పందించాడు. బుమ్రా లాంటి అత్యుత్తమ బౌలర్ ఓవర్లో అలాంటి షాట్ ఆడడం ఎందుకని కుక్ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
ఆ షాట్ వల్ల జో రూట్ ఔట్ - తొలి సారి మాత్రం అలా!
రాజ్‌కోట్‌లో పట్టు బిగించిన 'భారత్'- భారీ ఆధిక్యం దిశగా టీమ్ఇండియా