Jay Shah Asian Cricket Council: బీసీసీఐ సెక్రటరీ జై షా వరుసగా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇండోనేసియా బాలిలో బుధవారం (జనవరి 31) జరిగిన వార్షిక జనరల్ మీటింగ్‌లో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మరో ఏడాదిపాటు జై షా అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఇక 2021లో జై షా తొలిసారి ప్రెసిడెంట్‌గా ఎన్నికవ్వగా, 2023లో మరోసారి ఆయనే నియమితులయ్యారు. కాగా, ఇదే మీటింగ్‌లో ఏసీసీ బ్రాడ్‌కాస్టింగ్ హక్కు (Broadcasting Rights)లు, 2025 ఆసియాకప్ వేదికపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా, జై షా తన ఏసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని రీసెంట్గా పలు కథనాలు వచ్చాయి. అయితే 2024 నవంబర్‌లో జరగనున్న ఐసీసీ ఛైర్మన్ పోటీల్లో జై షా ఉంటారాని, ఈ నేపథ్యంలోనే ఆయన ఏసీసీ పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆయన మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం వల్ల ఈ వార్తలకు ఫుల్స్టాప్ పడినట్లయ్యింది. కాగా, ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్కలే ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన 2022 ననంబర్లో ఈ బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పటివరకూ భారత్ నుంచి ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఇద్దరే ఐసీసీ ఛైర్మన్లుగా వ్యవహరించారు.
-
The BCCI secretary Jay Shah has been reappointed as chairman of Asian Cricket Council for third consecutive term. #Cricket
— Press Trust of India (@PTI_News) January 31, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
(PTI File Photo) pic.twitter.com/HEXtNtGAkd
">The BCCI secretary Jay Shah has been reappointed as chairman of Asian Cricket Council for third consecutive term. #Cricket
— Press Trust of India (@PTI_News) January 31, 2024
(PTI File Photo) pic.twitter.com/HEXtNtGAkdThe BCCI secretary Jay Shah has been reappointed as chairman of Asian Cricket Council for third consecutive term. #Cricket
— Press Trust of India (@PTI_News) January 31, 2024
(PTI File Photo) pic.twitter.com/HEXtNtGAkd
Jay Shah Career: 2009లో జై షా అహ్మదాబాద్ క్రికెట్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, ఆ తర్వాత 2013లో గుజరాత్ క్రికెట్ బోర్డు జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2015లో బీసీసీఐలోకి ఎంటర్ అయ్యారై కొన్నేళ్లపాటు ఫైనాన్స్, మార్కెటింగ్ కమిటీ వ్యవహారాలు చూసుకున్నారు. ఆ తర్వాత 2019 లో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జై షా, 2021 జనవరిలో ఏసీసీ ప్రెసిడెంట్‌గా నియామకం అయ్యారు. ప్రస్తుతం జై షా ఐసీసీలో అత్యంత కీలకమైన ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇక 2023 సంవత్సరానికిగాను జై షా స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నారు.
ACC పదవికి జై షా రాజీనామా!- నెక్ట్స్ టార్గెట్ ICC ఛైర్మన్?