Bumrah Google Record : గబ్బా టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులకు ఆలౌటైంది. జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లతో అదరగొట్టాడు. మూడో ఆట ముగిసే సమయానికి భారత్ 51-4 స్కోరుతో కష్టాల్లో ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్ (33), రోహిత్ శర్మ (0) ఉన్నారు. అయితే మూడో రోజు ఆట ముగిసిన అనంతరం బుమ్రా విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రిపోర్టర్ అడిగిన ఓ ప్రశ్నకు బుమ్రా ఇంట్రెస్టింగ్గా సమాధానమిచ్చాడు.
గబ్బా మైదానంలో బ్యాటింగ్ పరిస్థితుల గురించి మీడియా నుంచి బుమ్రాకు ప్రశ్న ఎదురైంది. దీనికి బుమ్రా ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. టెస్టుల్లో తన బ్యాటింగ్ రికార్డు గురించి గూగుల్‌లో సెర్చ్ చెయ్యాలని సరదాగా బదులిచ్చాడు. బుమ్రా ఇచ్చిన ఈ చమత్కారమైన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బుమ్రా- మీడియా సంభాషణ
మీడియా: 'హాయ్, బుమ్రా. బ్యాటింగ్‌పై మీ అంచనా ఏమిటి? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పే వ్యక్తి మీరు కాదు. అయినప్పటికీ గబ్బాలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే జట్టు పరిస్థితి (బ్యాటింగ్) గురించి మీరు ఏమని అనుకుంటున్నారు?'
బుమ్రా: 'ఇది ఆసక్తికరమైన ప్రశ్న. కానీ, మీరు నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి గూగుల్‌కు వెళ్లి, టెస్టుల్లో సింగిల్ ఓవర్‌లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరో వెతకండి. ఇది జోక్ మాత్రమే' అని రిప్లై ఇచ్చాడు. దీంతో అక్కడున్న జర్నలిస్టులు అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
🗣 " 𝙂𝙊𝙊𝙂𝙇𝙀 𝙒𝙃𝙄𝘾𝙃 𝙋𝙇𝘼𝙔𝙀𝙍 𝙃𝘼𝙎 𝙈𝙊𝙎𝙏 𝙍𝙐𝙉𝙎 𝙄𝙉 𝘼 𝙏𝙀𝙎𝙏 𝙊𝙑𝙀𝙍" - #JaspritBumrah knows how to handle tricky questions, just as he tackles tricky batters, speaking about his batting prowess, and the support he gets from the team's bowlers! 👊
— Star Sports (@StarSportsIndia) December 16, 2024
Excited… pic.twitter.com/uDX1P2NpRw
బుమ్రా రికార్డ్
అయితే బుమ్రా పేరిట అరుదైన రికార్డ్ ఉంది. టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసింది బుమ్రానే. 2022లో ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో అతడు ఈ ఘనత సాధించాడు. భారత్ స్కోర్ 377- 9 వద్ద బుమ్రా క్రీజ్‌లోకి వచ్చాడు. ఆపై స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో ఇక సింగిల్ సహా రెండు సిక్సర్లు (ఒకటి నోబాల్), 4 ఫోర్లు బాదాడు. మరోవైపు ఓ బంతి వైడ్‌గా వెళ్లి బౌండరీగా మారడం వల్ల టెస్టు క్రికెట్‌లో ఇదే అత్యంత ఖరీదైన ఓవర్ (మొత్తంగా 35 పరుగులు) గా నిలిచింది.
గబ్బా టెస్టు : బుమ్రా పాంచ్ పటాకా- అయినా రెండో రోజు ఆసీస్‌దే!