Punjab Kings Head Coach Ricky Ponting : ఐపీఎల్లో ఎలాగైనా తమ రాత మార్చుకోవడానికి పంజాబ్ కింగ్స్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ కోసం మరోసారి హెచ్ కోచ్‌ను మార్చింది ఆ జట్టు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఐపీఎల్ 2025 సీజన్లో అతడు పంజాబ్ జట్టుకు హెచ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
పాటింగ్ పై గంపెడశలు - యువ ప్రతిభను ప్రోత్సహించడం, ఆటగాళ్ల ప్రతిభను అంచనా వేయడంలో పాటింగ్ దిట్ట. ఈ నేపథ్యంలో పాంటింగ్ సారథ్యంలో తమ జట్టు మంచి ఫలితాలను సాధిస్తుందని కింగ్స్ పంజాబ్ భావిస్తోంది. పాంటింగ్ అనుభవం, వ్యూహాలు, ట్రాక్ రికార్డు తమ జట్టుకు పనికొస్తాయని అంచనా వేస్తోంది. దీంతో వచ్చే సీజన్లో అదరగొట్టాలని పంజాబ్ కింగ్స్ యోచిస్తోంది.
ఐపీఎల్లో పంజాబ్ విఫలం - ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం త్వరలోనే జరగనున్న నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ తమ కొత్త హెడ్ కోచ్ గా రికీ పాంటింగ్ ను నియమించడం గమనార్హం. అయితే గత ఏడు సీజన్లలో 6సార్లు ఆ టీమ్ తమ హెడ్ కోచ్ లను మార్చింది. ఐపీఎల్లో 2008 నుంచి కొనసాగుతున్న ఆ ఫ్రాంఛైజీ ఇప్పటి వరకూ కేవలం రెండుసార్లే ప్లేఆఫ్స్ కు చేరింది.
𝐏𝐔𝐍TER is 𝐏𝐔𝐍JAB! 🦁♥️
— Punjab Kings (@PunjabKingsIPL) September 18, 2024
🚨 Official Statement 🚨
Ricky Ponting joins Punjab Kings as the new Head Coach! #RickyPonting #SaddaPunjab #PunjabKings pic.twitter.com/DS9iAHDAu7
ఐపీఎల్లో పాంటింగ్ కెరీర్ - ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ అయిన రికీ పాంటింగ్ ఐపీఎల్లో ప్లేయర్‌గా కేవలం రెండు సీజన్లలోనే ఆడాడు. 2008లో కోల్‌కతా, 2013లో ముంబయి ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్లో ముంబయి కెప్టెన్‌గా ఉన్నా కూడా, మధ్యలోనే తప్పుకొని రోహిత్‌కు కెప్టెన్సీ ఇచ్చాడు. అదే ఏడాది అన్ని ఫార్మాట్లకు పాంటింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ముంబయికి మెంటార్‌గా కొనసాగాడు. 2015, 2016లలో అదే ఫ్రాంఛైజీ హెడ్ కోచ్‌గా ఉన్నాడు.
2018లో దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గానూ పాంటింగ్ నియామకమయ్యాడు. 2019, 2020, 2021 సీజన్లో పాంటింగ్ హెచ్ కోచ్‌గా ఉండగానే దిల్లీ వరుసగా మూడుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. 2020లో ఫైనల్‌కు చేరినా, ట్రోఫీ సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి రికీ పాంటింగ్‌ను తొలగించింది.