IPL 2024 Sunrisers Hyderabad Final : ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన కీలక క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 36 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ తుది పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. హైదరాబాద్ బౌలర్ల దెబ్బకు ఆర్ఆర్ బ్యాటర్లు తడబడ్డారు. యశస్వి జైశ్వాల్(42: 21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ధ్రువ్ జురెల్ (56*: 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. టామ్ కోహ్లెర్(10), కెప్టెన్ సంజూ శాంసన్(10), రియాన్ పరాగ్(6), సిమ్రాన్(4), రోవ్మన్ పోవెల్(6) పరుగులు చేశారు. అసలు 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆర్ఆర్. ఈ సమయంలో జురెల్ ఆదుకోవడంతో రాజస్థాన్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. లేదంటే భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయేది. ఎస్ఆర్హెడ్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ 3 వికెట్ల ప్రదర్శన చేశాడు. అభిషేక్ శర్మ పాట్, కమిన్స్, నటరాజన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(34 బంతుల్లో 4 సిక్స్‌ల సాయంతో 50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్ త్రిపాఠి(15 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్‌ల సాయంతో 37), ట్రావిస్ హెడ్(28 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 34) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అభిషేక్ శర్మ(12), నితీశ్ రెడ్డి(5), మారక్రమ్(1), అబ్దుల్ సమద్(0) నిరాశ పరిశారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన షాబాజ్ అహ్మద్(18) పరుగులు చేశాడు. ఇక రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. సందీప్ శర్మ రెండు వికెట్లు దక్కించుకున్నారు.
-
THAT WINNING FEELING 🤩✨#PlayWithFire #SRHvRR https://t.co/D3uHKENVsY
— SunRisers Hyderabad (@SunRisers) May 24, 2024
SRHను ఫైనల్ పంపేందుకు RCB సాయం - ఎలా అంటే? - IPL 2024 Qualifier 2 Match
పాకిస్థాన్ జర్నలిస్ట్‌కు రైనా స్ట్రాంగ్ కౌంటర్ - ఇచ్చి పడేశాడు! - Suresh Raina