ETV Bharat / sports

గుజరాత్​తో మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్​కు హైదరాబాద్ - IPL 2024 GT VS SRH - IPL 2024 GT VS SRH

IPL 2024 GT VS SRH : ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్-గుజరాత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకముందే రద్దైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఆటను రద్దు చేస్తూ మ్యాచ్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో హైదరాబాద్ 15 పాయింట్లతో ప్లేఆఫ్స్​కు అర్హత సాధించింది.

The Associated Press
IPL 2024 (The Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 10:28 PM IST

Updated : May 16, 2024, 10:40 PM IST

IPL 2024 GT VS SRH : ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్-గుజరాత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకముందే రద్దైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఆటను రద్దు చేస్తూ మ్యాచ్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో హైదరాబాద్ 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించింది. అలా లీగ్‌ దశలో ఇంకా ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది సన్​రైజర్స్​.

వాస్తవానికి మధ్యాహ్నం నుంచే హైదరాబాద్​ నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. ఉప్పల్‌లోనూ భారీ వర్షం పడింది. దీంతో కనీసం టాస్‌ కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే మధ్యలో కాసేపు వరుణుడు శాంతించడం వల్ల మ్యాచ్‌ను నిర్వహించేందుకు మైదానాన్ని గ్రౌండ్ స్టాఫ్‌ సిద్ధం చేశారు. 8 గంటలకు టాస్‌ వేయాలని భావించారు. కానీ, అంతలోనే మళ్లీ వర్షం మొదలైపోయింది. చాలాసేపు వేచి చూసినా వర్షం ఆగలేదు. దీంతో చేసేదేమిలేక మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు మ్యాచ్ నిర్వాహకులు ప్రకటించారు. ఇక సన్​రైజర్స్​ ప్లే ఆఫ్స్​కు చేరుకోవడంతో సన్​రైజర్స్​ ఫ్యాన్స్​ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అలా జరిగితే రెండో స్థానానికి - సన్​రైజర్స్​ తమ చివరి మ్యాచ్‌ను పంజాబ్‌ కింగ్స్​తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఎస్​ఆర్​హెచ్​ గెలిస్తే పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంటుంది. కానీ ఇది జరగాలంటే కోల్‌కతా నైట్​ రైడర్స్​తో జరిగే తమ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్ కూడా ఓడిపోవాలి. అప్పుడు రాజస్థాన్‌ 16 పాయింట్లతో కిందికి దిగుతుంది. హైదరాబాద్‌ 17 పాయింట్లతో రెండో పొజిషన్​కు చేరుకుంటుంది.

చివరి బెర్తు ఏ జట్టుదో - గుజరాత్‌ టైటాన్స్​తో జరగాల్సిన మ్యాచ్‌ రద్దు కావడం వల్ల సన్​రైజర్స్​ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్​, రాజస్థాన్‌ రాయల్స్​ ప్లేఆఫ్స్‌ బెర్తులను కన్ఫామ్ చేసుకున్నాయి. దీంతో చివరి బెర్త్​ నాలుగో స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారా? అనేది ఇప్పుడు క్రికెట్ ప్రియుల్లో ఆసక్తికరంగా మారింది. శుక్రవారం ముంబయి ఇండియన్స్​పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్​ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధిస్తే 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ రేసులో నిలుస్తుంది.

అలాగే శనివారం బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇందులో గెలిస్తే చెన్నై డైరెక్ట్​గా ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోతుంది. ఇతర జట్లు ఇంటికి వెళ్తాయి. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉంది. మ్యాచ్‌ రద్దయితే చెన్నై ఖాతాలో 15 పాయింట్లు వస్తాయి. ముందడగు వేస్తుంది. అదే మ్యాచ్‌ జరిగి ఆర్సీబీ గెలిస్తే ఆర్సీబీ, చెన్నై, దిల్లీ, లఖ్‌నవూ 14 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్‌ ఎవరికే ఉంటే ఆ జట్టే ప్లే ఆఫ్స్​కు అర్హత సాధిస్తుంది. అయితే, దిల్లీ క్యాపిటల్స్​, లఖ్‌నవూకు మైనస్‌ నెట్‌రన్‌రేట్‌ ఉండటం వల్ల సీఎస్కే, ఆర్సీబీలో ఏదో ఒక జట్టు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది.

'నా రక్తంలోనే అది ఉంది - కోహ్లీ ఎంతో ప్రత్యేకం' - Usain Bolt Kohli

కోచ్ కూతురితో సీక్రెట్​ లవ్ ట్రాక్​ - 13 ఏళ్లు డేటింగ్​ చేశాక పెళ్లి! - Sunil Chhetri Love story

Last Updated : May 16, 2024, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.