ETV Bharat / sports

ఒక్క మ్యాచ్ 523 పరుగులు 38 సిక్స్‌లు - ఉప్పల్​లో సన్​రైజర్స్​ రికార్డుల సునామీ! - IPL 2024 MI VS Sunrisers Hyderabad

IPL 2024 Mumbai Indians VS Sunrisers Hyderabad Match Records : ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై సన్​రైజర్స్ అదరగొట్టేసింది. అలానే ఈ మ్యాచ్​లో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి. వాటిని తెలుసుకుందాం.

సన్​రైజర్స్​ బ్యాటర్ల రికార్డుల మోత
సన్​రైజర్స్​ బ్యాటర్ల రికార్డుల మోత
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 6:56 AM IST

Updated : Mar 28, 2024, 7:02 AM IST

IPL 2024 Mumbai Indians VS Sunrisers Hyderabad Match Records : ఒకడు మెరుపైతే ఇంకొకడు ఉరుము, మరొకడు పిడుగు అనేలా విజృంభించారు సన్​రైజర్స్​ బ్యాటర్లు. ట్రావిస్‌ హెడ్‌ (24 బంతుల్లో 9×4, 3×6 సాయంతో 62 పరుగులు), అభిషేక్‌శర్మ (23 బంతుల్లో 3×4, 7×6 సాయంతో 63 పరుగులు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (34 బంతుల్లో 4×4, 7×6 సాయంతో 80 నాటౌట్‌) ఆకాశమే హద్దుగా చెలరేగి ఉప్పల్‌ స్టేడియంలోకి తమ ఇన్నింగ్స్​తో పరుగుల సునామీని తీసుకొచ్చారు. అయినా కూడా ముంబయి బ్యాటర్లేమి తక్కువేమి తినలేదు. ఛేదన కష్టం అనిపించినా తమ శాయశక్తులా గట్టిగా పోరాడారు. తిలక్‌వర్మ (34 బంతుల్లో 2×4, 6×6 పరుగులు సాయంతో 64), టిమ్‌ డేవిడ్‌ ( 22 బంతుల్లో 2×4, 3×6 సాయంతో 42 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (13 బంతుల్లో 2×4, 3×6 సాయంతో 34) ధనాధన్ ఇన్నింగ్స్​ ఆడారు. కానీ చివరికి విజయం సన్​రైజర్స్​నే వరించింది. సన్​రైజర్స్​ 277/3 చేస్తే ముంబయి 246/5తో ఓడిపోయింది. అలానే ఈ మ్యాచ్​లో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి. వాటిని చూసేద్దాం.

  • ఈ మ్యాచ్‌లో మొత్తంగా 523 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్‌లోని ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే కావడం విశేషం.
  • ఈ మ్యాచ్​ తొలి 10 ఓవర్లలో సన్‌రైజర్స్‌ సాధించిన స్కోరు 148. దీంతో గతంలో 2014లో పంజాబ్‌, 2021లో ముంబయి చేసిన 131 పరుగుల రికార్డు బ్రేక్ అయింది.
  • ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్​ సాధించిన స్కోరు 277/3. ఐపీఎల్‌ చరిత్రలోనే ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోరూ ఇదే కావడం విశేషం. గతంలో 2013లో పుణె వారియర్స్‌పై ఆర్సీబీ సాధించిన 263/5 రికార్డ్ బ్రేక్ అయింది. మొత్తంగా చూసుకుంటే పురుషుల టీ20ల్లో నేపాల్‌ (314/3), అఫ్గానిస్థాన్‌ (278/3) టీమ్స్​ మాత్రమే సన్‌రైజర్స్‌ కన్నా ముందున్నాయి.
  • హెడ్‌- అభిషేక్‌ ద్వయం ఓ రికార్డ్ సాధించింది. ఐపీఎల్​లోని ఒకే మ్యాచులో ఒకే జట్టు నుంచి 20 బంతుల్లోగా హాఫ్​ సెంచరీలు బాదిన తొలి ద్వయంగా నిలిచింది.
  • ఈ మ్యాచ్​లో అభిషేక్‌ శర్మ హాఫ్​ సెంచరీ సాధించేందుకు 16 బంతులు తీసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సన్‌రైజర్స్‌ తరపున ఈ మార్క్ అందుకున్న బ్యాటర్ ఇతడే.
  • ఐపీఎల్‌లో ముంబయి తరపున రోహిత్‌ ఆడిన మ్యాచ్‌లు 200. ఆ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడింది అతడే కావడం విశేషం. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు రోహిత్‌కు సచిన్‌ ఓ బహుమతిని అందించారు. 200 నెంబర్​తో కూడిన ప్రత్యేక జెర్సీ, టోపీని బహుకరించాడు.
  • ఈ మ్యాచ్‌లో మొత్తం సిక్సర్ల సంఖ్య 38. ముందు ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు రికార్డు 33 ఆర్సీబీ పేరిట ఉండేది. ఇప్పుడది బద్దలైంది.
  • ఈ మ్యాచ్​లో ముంబయి పేసర్‌ మపాక సమర్పించుకున్న పరుగులు 66. ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్నది ఇతడే.

ఉప్పల్‌ ఊగిపోయింది - ముంబయిపై సన్​రైజర్స్​ అద్భుత విజయం - MI VS SRH IPL 2024

సన్​రైజర్స్ సంచలనం- ఐపీఎల్​లో ఆల్​టైమ్ హైయెస్ట్ స్కోర్​ నమోదు - SRH VS MI IPL 2024

Last Updated : Mar 28, 2024, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.